హైదరాబాద్: సామజిక మాధ్యమాలు ఎప్పటికప్పుడు నూతన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తోంటాయి. (Whatsapp) వాట్సాప్ తన వినియోగదాయులను కాపాడుకోవడంతో పాటు కొత్తవారిని ఆకర్షించడానికి కొత్త కొత్త ఫీచర్లును ఆవిష్కరణల ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. అంతేకాకుండా వాట్సాప్ ఎప్పటికప్పుడు నూతన అప్డేట్లతో ఆకట్టుకునే వాట్సాప్ తాజాగా మరో సరికొత్త పీఛర్ను అందుబాటులోకి తెచ్చింది.
Also Read: నాగబాబుపై టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతా రాయ్ ఓయూ పోలీసులకు ఫిర్యాదు
కొత్త నంబర్లు యాడ్ చేసుకోవడం ఇబ్బందులను దృష్టిలో పుట్టుకుని తాజా ఫీచర్ అందుబాటులోకి తెస్తున్నట్టు పేర్కొంది. సాధారణంగా ఎవరి ఫోన్ నెంబరైనా మన ఫోన్లో మన లిస్ట్ లో చేర్చుకోవాలంటే కాంటాక్ట్ మెనుకూ వెళ్లి అక్కడ టైప్ చేసి, యాడ్ కాంటాక్ట్ కొట్టి, ఆ పై సేవ్ చేసుకుంటూ ఉంటారు. ఇలా ఎక్కువ సంఖ్యలో నెంబర్లను యాడ్ చేసుకోవడం కష్టమే. ఇలాంటి సందర్భాల కోసమే వాట్సాప్ ఈ సరికొత్త ఫీచర్‌ను తీసుకురాబోతోందని, మ్యానువల్‌గా టైప్ చేస్తే కొన్నిసార్లు పొరపాట్లకు ఆస్కారం ఉండొచ్చు కాబట్టి ఈ ఫీచర్‌తో నేరుగా సేవ్ చేసుకోవచ్చు ఏ నంబరైనా సేవ్ చేసుకోవాలంటే వాట్సాప్‌లోని వాళ్ల QR కోడ్‌ను స్కాన్ చేస్తే చాలు ఆటోమేటిక్‌గా ఆ కాంటాక్ట్ ఫోన్లో యాడ్ అయిపోతుంది. ఇది బీటా వెర్షన్లో అందుబాటులో ఉండగా త్వరలోనే వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం జరుగుతున్నాయని వెల్లడించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..