సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం 'కాలా'. పా.రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అయితే కర్ణాటకలో మాత్రం కాలా విడుదలపై అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో.. కర్ణాటకలో 'కాలా' సినిమాకు లైన్ క్లియర్ అయ్యింది. ఈ నెల 7న కర్ణాటకలో సినిమా విడుదలకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. థియేటర్ల వద్ద ఎలాంటి ఘర్షణలు జరగకుండా ప్రభుత్వం భద్రత కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది.
Karnataka High Court refuses to intervene in 'Kaala' movie ban, asks lawyers representing 'Kaala' to provide details of theaters to the State which is then bound to provide security. pic.twitter.com/e9jZg2ncvB
— ANI (@ANI) June 5, 2018
అంతకు ముందు కర్ణాటకలో 'కాలా' విడుదల నిలిపివేతపై రజనీకాంత్ స్పందించారు. 'కర్ణాటకలో కాలా సమస్యలని ఎదుర్కోదు అని నేను అనుకోను. కర్ణాటకలో కేవలం తమిళ ప్రజలు మాత్రమే కాదు, ఇతర భాషలను మాట్లాడే వారు ఉన్నారు. వారు ఈ సినిమాని చూడాలనుకుంటున్నారు. కర్నాటక ప్రభుత్వం థియేటర్లకు, ప్రేక్షకులకు తగిన భద్రత కల్పిస్తుందని నేను భావిస్తున్నాను' అని అన్నారు. కాగా ఇటీవల కావేరీ జలాల విషయంలో రజినీకాంత్ వ్యాఖ్యలకు నిరసనగా కాలా సినిమాను అడ్డుకుంటామని ఆందోళనకారులు ప్రకటించిన సంగతి తెలిసిందే.
నిన్న కమల్ హాసన్ కర్ణాటక సీఎం కుమార స్వామిని కలిసి కావేరీ జలాల విషయంలో చర్చలు జరిపిన సమయంలో 'కాలా' సినిమా చర్చకు వచ్చినట్లు.. సినిమా విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరినట్లు సమాచారం.