శరీరానికి నీళ్లు చాలా అవసరం. రోజూ తగినంత నీళ్లు తాగకపోతే డీహైడ్రేషన్ సమస్య ఉత్పన్నమౌతుంది. అయితే కొన్ని సందర్భాల్లో నీళ్లు ఎంత తాగినా డీ హైడ్రేషన్ సమస్య వస్తుంటుంది. దీనికి కారణమేంటి, ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో తెలుసుకుందాం.
రోజూ తగినంత పరిమాణంలో నీళ్లు తాగడం ఎంత అవసరమో సరైన సమయంలో తగినంతగా నీళ్లు తాగడం కూడా ముఖ్యమే. ఎందుకంటే శరీరంలో 60 శాతం నీళ్లే ఉంటాయి. ఇది అలాగే కొనసాగితే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. సీరంలోని ప్రతి అవయవానికి నీరు చాలా అవసరం. శరీరంలోని విష పదార్ధాలను బయటకు తొలగించేందుకు అద్భుతంగా పనిచేస్తుంది. శరీరం ఉష్ణోగ్రత తగ్గించేందుకు దోహదపడుతుంది. అందుకే నీళ్లు ఎప్పుడెప్పుడు తాగాలి, ఎంత తాగాలనేది తెలుసుకోవాలి.
ఉదయం లేవగానే రోజూ ఒక గ్లాసు నీళ్లు తాగితే శరీరాన్ని డీటాక్స్ చేసేందుకు దోహదమౌతుంది. రాత్రంతా నిద్రించిన తరువాత శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. అందుకే రోజూ ఉదయం లేవగానే తగినంత నీళ్లు తప్పకుండా తాగాలి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మెటబోలిజంను వేగవంతం చేస్తుంది.త్వర్వతరగా నీళ్లు ఎప్పుడూ తాగకూడదు. ఒకేసారి ఎక్కువ నీళ్లు తాగడం మంచిది కాదు. నీళ్లను ఎప్పుడూ కొద్దికొద్దిగా బ్రేక్ ఇస్తూ తాగుతుండాలి. ఇలా చేయడం వల్ల తాగిన నీరు శరీరం అంతా వ్యాపిస్తుంది. శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది.
అన్నింటికంటే ముఖ్యంగా రోజూ ఉదయం లేచిన వెంటనే పరగడుపున గోరు వెచ్చని నీళ్లు తాగడం మంచిది. ఇది శరీరానికి చాలా ప్రయోజనకరం. జీర్ణక్రియను యాక్టివేట్ చేస్తుంది. శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల శరీరం డీటాక్స్ అవుతుంది. కండరాల నొప్పి కూడా తగ్గుతుంది. నీటి అవసరం వ్యక్తిని బట్టి మారుతుంది. ఇది ఆ వ్యక్తి శారీరక శ్రమ వాతావరణం, ఆరోగ్యాన్ని బట్టి ఉంటుంది. ప్రతి వ్యక్తి రోజుకు 8-10 గ్లాసుల నీళ్లు తప్పకుండా తాగాలి. వ్యాయామం చేసే అలవాటుంటే నీళ్లు ఇంకాస్త ఎక్కువగా తాగాల్సి ఉంటుంది.
నీళ్లు తాగడాన్ని మీ దినచర్యలో భాగంగా చేసుకోవాలి. నిర్ణీత సమయంలో క్రమం తప్పకుండా నీళ్లు తాగుతుండాలి. ప్రతి గంటకు ఓ గ్లాసు నీళ్లు తాగాల్సి ఉంటుంది.
Also read: Turmeric Milk: ఈ సమస్య ఉన్నవాళ్లు పసుపు పాలు తాగితే ప్రమాదకరం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి