Black Raisins Benefits For Weight Loss: ఎండుద్రాక్ష ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో అనేక రకాల పోషకాలు దాగి ఉంటాయి. అందుకే ఆరోగ్య నిపుణులు వీటిని ప్రతి రోజు తీసుకోమని సూచిస్తారు. ఇందులో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు, బీటా కెరోటిన్, కాల్షియం, మెగ్నీషియం అధిక పరిమాణంలో లభిస్తాయి. ఇవి ప్రస్తుతం మార్కెట్‌లో రెండు రకాలుగా లభిస్తున్నాయి. ఒకటి తెలుపు రంగు ఎండుద్రాక్ష అయితే, రెంవది నలుపు రంగుతో కూడినవి..నలుపు రంగు ఎండు ద్రాక్ష నీటిలో నానబెట్టి ప్రతి రోజు తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అయితే వీటిని డైట్‌లో వినియోగించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఎండుద్రాక్ష ప్రయోజనాలు:
ఊబకాయం తగ్గుతుంది:
బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు నానబెట్టిన నల్ల ద్రాక్షలను డైట్‌లో తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇందులో సహాజ చక్కెర ఉంటుంది. కాబట్టి వీటిని దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు కూడా తీనవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను సులభంగా కరిగిస్తుంది. అయితే వీటిని తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. అతిగా తినడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు రావచ్చు.
Also Read: Snake in Ecil Canteen: క్యాంటీన్ పప్పులో పాము పిల్ల.. భయాందోళనలో ఈవీఎం ఉద్యోగులు
జీర్ణక్రియను మెరుగు పరుచుతుంది:
బయట లభించే అనారోగ్యకరమైన ఆహారాలు అతిగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. అయితే ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి ప్రతి ప్రతిరోజూ ఉదయం నానబెట్టిన ఎండుద్రాక్షను తినొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు మలబద్ధకం, గ్యాస్ సమస్యలను సులభంగా తగ్గిస్తుంది. దీంతో సులభంగా జీర్ణక్రియ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
కంటి చూపును మెరుగు పరుచుతుంది:
ప్రస్తుతం చాలా మంది విటమిన్ లోపం కారణంగా కంటి చూపు సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు విటమిన్ ఎ, బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అధిక పరిమాణంలో లభించే ఎండుద్రాక్ష ప్రతి రోజు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు కంటి చూపు లోపం సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా కంటిశుక్లం పని తీరును కూడా మెరుగు పరుచుతుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Snake in Ecil Canteen: క్యాంటీన్ పప్పులో పాము పిల్ల.. భయాందోళనలో ఈవీఎం ఉద్యోగులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook