Curd with Jaggery: ఈ వేసవి తాపం తీరడానికి ఎంత పెరుగు తిన్నా.. ఎంత మజ్జిగ తాగినా.. కూడా సరిపోదు అనిపిస్తుంది. పెరుగు వల్ల మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. కాబట్టి రోజుకి ఒకసారైనా పెరుగు తినడం మంచిది. కొంతమంది పెరుగులో పంచదార వేసుకొని తినడానికి ఇష్టపడతారు. తీయగా.. చల్లగా పెరుగు తింటుంటే.. ఈ వేసవికాలంలో చాలా హాయిగా ఉంటుంది. కానీ పంచదార ఎక్కువగా తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అందుకే పంచదార బదులు బెల్లం వేసుకుని తినాలి.
పెరుగు లో పంచదార కంటే బెల్లం వేసుకొని తినడం వల్ల ఇంకా ఎక్కువ ఉపయోగాలు ఉంటాయని చెబుతున్నారు వైద్య నిపుణులు. పెరుగులో పంచదార బదులు బెల్లం వేసుకొని తింటే గంటల తరబడి కడుపు నిండుగా ఉంటుందట. ఇలా తినడం ద్వారా కడుపు నిండుగా ఉంది.. ఆకలి ఎక్కువగా వేయదు. కాబట్టి బరువు కూడా చాలా సులువుగా తగ్గిపోవచ్చు. పెరుగు తో పాటే బెల్లం వల్ల కూడా బోలెడు ఆరోగ్యా ప్రయోజనాలు ఉన్నాయి.
పెరుగులో బెల్లం కలుపుకుని తినడం వల్ల.. మన రోగ నిరోధక శక్తి చాలా వరకు పెరుగుతుంది. తరచుగా అనారోగ్యానికి గురవుతూ ఉంటే.. పెరుగు.. బెల్లం కలిపి తినాలి. ఇలా రోజూ చేయడం వల్ల.. చాలా కొద్ది రోజుల్లోనే మీకు మంచి ఫలితం కనిపిస్తుంది. రోగనిరోధక శక్తి బలపడడంతో జలుబు, దగ్గు వంటి చిన్న చిన్న వ్యాధులు మనకి దూరంగా ఉంటాయి.
శరీరంలో రక్తహీనత వల్ల ఎన్నో ఇబ్బందులు వస్తాయి. అలాంటి సమయంలో పెరుగు బెల్లం కలిపి తినడం వల్ల.. రక్తహీనతను నయం చేసుకోవచ్చు. పెరుగులో ఉండే క్యాల్షియం, ఫాస్ఫరస్ రక్తహీనతను తగ్గిస్తాయి. బెల్లం లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వ్యాధుల నుంచి మనల్ని పరిరక్షిస్తాయి. ఇలా రోజు పెరుగులో.. బెల్లం తినడం వల్ల.. మన శరీరంలో రక్తం పెరిగి.. భవిష్యత్తులో వచ్చే పెద్ద అనారోగ్యాలను ముందుగానే నియంత్రించవచ్చు.
పెరుగు మన జీర్ణ క్రియకి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఐరన్ ఎక్కువగా ఉండే బెల్లం పెరుగుతో పాటు తింటే మలబద్ధకం, విరోచనాలు వాంతులు వెంటనే తగ్గిపోతాయి.
బరువు తగ్గాలి అనుకుంటున్నా వారికి కూడా పెరుగు బెల్లం బాగా ఉపయోగపడతాయి. బెల్లం దేనికైనా మంచి రుచిని ఇస్తుంది. పంచదార కంటే బెల్లం రుచి ఇంకా కమ్మగా ఉంటుంది. అందుకే పెరుగు నచ్చని వారు కూడా.. పెరుగులో బెల్లం వేసుకొని ఒకసారి తినడానికి ట్రై చేస్తే.. మళ్లీ మళ్లీ తింటారు. పెరుగు ఇష్టం లేకపోయినా కూడా బెల్లం తో పాటు తినడం వల్ల.. రుచితో పాటు బోలెడన్ని ఉపయోగాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈసారి పెరుగు తినేటప్పుడు కొంచెం బెల్లం వేసుకోవడం మర్చిపోకండి.
Also read: Janasena Glass Symbol: రెబెల్స్‌కు గాజు గ్లాసు గుర్తు, కూటమి అభ్యర్ధుల్లో ఆందోళన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook