Health News for Diabetic సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం, పైగా మనం తీసుకునే ఆహారం మీద కూడా ఇప్పుడు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇప్పుడు అందరికీ ఎక్కువగా జంక్ ఫుడ్ అలవాటు అయింది. అటువంటివి తరుచుగా తీసుకుంటూ ఉంటే ఈ సమస్యలన్నీ వస్తుంటాయి. అందులో ముఖ్యంగా మధుమేహం అనేది ప్రధానం ఎదురవుతుంది. మధుమేహాన్ని పూర్తిగా నయం చేయలేం.. దాన్ని మనం నియంత్రించగలం. సరైన ఆహారపు అలవాట్లతో దానికి చెక్ పెట్టొచ్చు.
మధుమేహంతో అధిక బరువు సమస్య కూడా వేధిస్తుంటుంది. రోజూ మీరు తీసుకునే ఆహారంలో అసమతుల్యం దెబ్బతింటే.. అధిక బరువు సమస్య వెంటాడుతుంది. సరైన ఆహారపు అలవాట్లు, సరైన ఫుడ్‌ను తీసుకుంటే మనం వీటిని ఇట్టే అదుపులో పెట్టేసుకోచ్చు. మధుమేహం కంట్రోల్ చేయాలన్నా, అధిక బరువు సమస్య తీరాలన్నా వీటిని మనం తీసుకోవాల్సిందే.
మధుమేహంతో బాధపడే రోగులు తమ మెనూలో ఈ కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. క్యారెట్, పచ్చి మిరపకాయ, ఆకుపచ్చ బటానీలు, టొమాటో, మొక్కజొన్న వంటి వాటిని అలవాటు చేసుకోవాలి. ఇక పండ్ల విషయానికి వస్తే.. సీజనల్ ఫ్రూట్స్‌ను ఎక్కువగా తీసుకోవాలి. నారింజలు, పుచ్చకాయ, ఆపిల్, అరటిపండు, ద్రాక్ష వంటి వాటిని తీసుకోవాలి.
అదే పప్పులు, తృణ ధాన్యాల విషయానికి వస్తే.. గోధుమలు, బ్రౌన్ రైస్, గోధుమ రొట్టె వంటి వాటిని ఆహారంగా తీసుకోవాలి. బరువు తగ్గాలంటే ప్రొటీన్లు చాలా అవసరం. అందుకే మన ఫుడ్‌లో చేప, గుడ్లు, నట్స్ , వేరుశెనగ
వంటివి తీసుకోవాలి. ఇక మధుమేహ వ్యాధిగ్రస్తులు బరువు తగ్గించుకోవడానికి లాక్టోస్ లేని పాలు, పెరుగును తీసుకోవచ్చు.
వీటితో పాటుగా ఈ కింది 7 సూచనలు పాటించండి..
కార్బోహైడ్రేట్లు ఉండే ఫుడ్‌ను తీసుకోవాలి.
తక్కువ ఉప్పు వాడాలి.
తక్కువ ప్రాసెస్ చేసిన మాంసాన్ని వాడాలి.
సీజనల్, తాజా పండ్లు, కూరగాయలు తినండి
ఫ్యాట్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని ఎంచుకోండి
చక్కెర తగ్గించాలి
మద్యం వినియోగం పరిమితంగా ఉండాలి
(నిరాకరణ: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)