Nutmeg Water Benefits: జాజికాయ ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందిన ఒక సుగంధ ద్రవ్యం. ఇది మిరిస్టికా జాతికి చెందిన చెట్టు విత్తనం నుంచి వచ్చిన మసాలా. జాజికాయ సువాసనగలది, తీపి రుచి కలిగి ఉంటుంది. ఇది ప్రధానంగా వంటకాల్లో, బేకింగ్‌లో ఉపయోగిస్తారు. జాజికాయను కొన్నిసార్లు ఔషధ ప్రయోజనాల కోసం కూడా ఉపయోగిస్తారు. అయితే దీన్ని నీటిలో కలిపి తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలకు చక్కటి నివారణ లభిస్తుంది. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు జాజికాయ నీటిని తాగడం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ తెలుసుకుందాం.
జాజికాయంలో అద్భుమైన పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఇందులో కాల్షియం, ఐరన్, మాంగనీస్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అంతేకాకుండా జాజికాయలో ఉండే పొటాషియం వల్ల అధిక రక్తపోటు సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జీర్ణక్రియ ఎంజైమ్‌లను మెరుగుపరచడంలో ఎంతో ఉపయోగపడుతాయి. దీని వల్ల మలబద్ధకం, అజీర్ణం, గ్యాస్, ఊబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి. రాత్రి పడుకొనే ముందు గ్లాస్ వాటర్‌లో ఈ జాజికయ పొడి తీసుకోవడం చాలా మంచిది.
జాజికయపొడిని రాత్రి నిద్రపోయే ముందు తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్య నుంచి బయటపడవచ్చు. ఇందులోని మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తిని పెంచుతుంది. దీని వల్ల మంచి నిద్ర కలుగుతుంది. అలాగే ఒత్తిడి, ఆందోళన సమస్యలతో బాధపడేవారు ఈ పొడి నీళ్ళు తీసుకోవడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. దీంతో నిద్ర బాగా పడుతుంది.
ఒక చోటనే ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల వెన్ను, తల, మెడ వంటి నొప్పులు కలుగుతుంటాయి. ఈ లక్షణాలతో బాధపడేవారు ప్రతిరోజు రాత్రి జాజికాయ పొడి తీసుకోవడం వల్ల ఈ సమస్యలు తగ్గుతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడేవార జాజికాయపొడి తీసుకోవడం వల్ల ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు శ్వాసకోశ సమస్యలను నివారించడంలో సహాయపడతాయి.
అంతేకాకుండా శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గినప్పుడు ఈ పొడి తీసుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. అలాగే తీవ్రమైన అంటూ వ్యాధులను తట్టుకునే శక్తిని పెంచుతాయి.
గమనిక:
* జాజికాయ వేడి నీటిలో కలిపి తాగడం మంచిది.
* గర్భిణీ స్త్రీలు, చిన్న పిల్లలు జాజికాయను తీసుకునే ముందు వైద్యుని సలహా తీసుకోవడం మంచిది.
* అతిగా తీసుకోవడం వల్ల కడుపు నొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
ముగింపు:
జాజికాయ నీరు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. అయితే, ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే వైద్యుని సలహా తీసుకోవడం మంచిది.
Also Read: Gua Sha Benefits: Gua Sha ధెరపి వల్ల ఎన్నో ఉపయోగాలో తెలుసా? ఎలా ఉపయోగించాలి అంటే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter