Chapati Benefits: మీ డైట్‌లో చపాతీలను తీసుకుంటున్నారా ? అయితే ఈ విషయం ఖచ్చితంగా తెలుసుకోండి!

Chapatis For Weightloss: నేటి కాలంలో చాలా మంది అధిక బరువు సమస్యతో తీవ్ర ఇబ్బందులకు పడుతున్నారు. దీని కారణంగా వివిధ రకాల అనారోగ్య సమస్యలకు గురి అవుతున్నారు.  ఈ సమస్య నుంచి బయట పడడానికి డైటింగ్‌, యోగా, ఖర్చుతో కూడా చికిత్సలు వంటివి చేస్తున్నారు. అయితే డైటింగ్ ఫుడ్‌లో  భాగంగా రాత్రి పూట అన్నం తిన‌కుండా చపాతీలను తీసుకుంటున్నారు. ఈ చపాతీలు ఎలా తీసుకుంటే బరువు తగ్గవచ్చు అనే విషయంపై మనం తెలుసుకుందాం..

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 30, 2023, 06:22 AM IST
Chapati Benefits: మీ డైట్‌లో చపాతీలను తీసుకుంటున్నారా ? అయితే ఈ విషయం ఖచ్చితంగా తెలుసుకోండి!

Chapatis for weightloss: అధిక బరువుతో బాధపడుతున్నవారు ఎక్కువగా చపాతీలను రాత్రి పూట డైట్‌లో భాగంగా తీసుకుంటారు. ఇలా చేయడం వల్ల బరువు తగ్గుతారు. అయితే దీని తీసుకోవడం వల్ల ఎక్కువ ఆకలి  రాకుండా చేస్తుందని భావిస్తారు. అయితే చపాతీలను తీసుకోవడం వల్ల బరువు తగ్గాతారా..? బరువు తగ్గే ఛాన్స్‌ ఉందా..? అనే విషయంపై మనం తెలుసుకుందాం.

చపాతీ పిండి అనేది గోధుమలతో తయారు చేస్తారు. ఈ పిండిలో ఫైబర్‌ కంటెంట్‌ ఉంటుంది. ఈ కంటెంట్‌ కొవ్వును కరిగించి బరువును తగ్గిస్తుందని భావిస్తారు. అయితే కొంతమంది  చ‌పాతీల విష‌యానికి వ‌చ్చే స‌రికి కొంద‌రు వీటిని ఎక్కువగా  తింటుంటారు. ఇలా చేయడం వల్ల బరువు  తగ్గుతారు అని అనుకుంటే ముమ్మాటికీ వాస్తవం కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎక్కువగా చపాతీలు తీసుకుంటే బ‌రువు పెరుగుతారని నిపుణులు చెబుతున్నారు. 

Also read: Unwanted Hair: అన్ వాంటెడ్ హెయిర్‌తో బాధపడుతున్నారా? ఈ టిప్స్‌ను ట్రై చేయండి!

చపాతీలను ఎన్ని తినాలి ? ఎన్ని తింటే బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు ? 

చపాతీ తినేవారు నూనె వేయకుండా  రెండు తయారు చేసుకుంటే చాలు. దీని వల్ల 140 క్యాల‌రీలు అందుతాయి. ఇలా చేయడం వల్ల బ‌రువు త‌గ్గేందుకు అవ‌కాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 

అయితే ఈ చపాతీలను రాత్రి వేలనే కాకుండా మధ్యాహ్నం టైమ్‌లో కూడా తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. దీంతో క్యాల‌రీల‌ను త‌క్కువ‌గా అందడం వల్ల బరువు ల‌భంగా త‌గ్గుతారు. ఇలా డైట్‌ను పాటిచడం వల్ల క‌చ్చితంగా బ‌రువు త‌గ్గుతారని చెబుతున్నారు.

Also read: Unknown Facts About Masturbation: అతిగా హస్తప్రయోగం చేసుకోవడం మంచిదేనా? తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News