Tips for healthy lifestyle: మీ ఆరోగ్యానికి భరోసానిచ్చే 10 చక్కని టిప్స్...

Tips for Healthy Lifestyle: బిజీ జీవితాల్లో పడి చాలామంది తమ ఆరోగ్యాన్ని అశ్రద్ద చేస్తారు. తిండి దగ్గరి నుంచి రోజువారీ అలవాట్ల వరకూ అన్నీ అస్తవ్యస్తంగా మారిపోతాయి. ఫలితంగా ఆ ప్రభావం మానసిక, శారీరక ఆరోగ్యంపై పడుతుంది. ఇక్కడ చెప్పిన 10 టిప్స్ పాటించడం ద్వారా మంచి లైఫ్ స్టైల్‌తో మీరు ముందుకు సాగవచ్చు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 28, 2021, 06:58 PM IST
  • బిజీ లైఫ్‌తో గాడి తప్పుతున్న జీవితాలు
    ఆధునికత మాయలో పడి ఆరోగ్యానికి చేటు చేసే అలవాట్లు
    ఆరోగ్యకరమైన జీవన శైలి కోసం ఈ 10 టిప్స్ పాటించండి
Tips for healthy lifestyle: మీ ఆరోగ్యానికి భరోసానిచ్చే 10 చక్కని టిప్స్...

Tips for Healthy Lifestyle: కాలంతో పాటే మార్పు సహజం. అయితే ఆ మార్పు మనకు మేలు చేసేదా లేక చేటు చేసేదా అన్న స్పృహ ఉండాలి. జీవితంలో ఆధునికత తీసుకొచ్చే మార్పుల ప్రభావం వ్యక్తుల అలవాట్లు, ఆలోచనలు, భావాలపై తప్పక ఉంటుంది. మొత్తంగా వ్యక్తుల జీవన శైలినే అది ప్రభావితం చేస్తుంది. ఈ క్రమంలో ఆధునికత మాయలో పడి కొట్టుకుపోవడం కాకుండా... మన అలవాట్లు సరైనవేనా కావా అన్న రియాలిటీ చెక్ అవసరం. మన అలవాట్లు ఆరోగ్యానికి ఏమాత్రం చేటు చేసే అవకాశం ఉన్నా వాటిని దూరం పెట్టాలి. అంతకంటే ముందు మంచి అలవాట్లను అలవరుచుకోవాలి. ఆరోగ్యకరమైన జీవనశైలికి ఈ 10 టిప్స్ పాటించండి.

ఆరోగ్యకరమైన జీవన శైలికి  10 టిప్స్ :

1) డైట్ : మీ రోజు వారీ డైట్‌లో పండ్లు, కూరగాయలు, తృణ ధాన్యాలు తప్పనిసరిగా ఉండేలా చూసుకోండి. రోజులో కనీసం 400 గ్రాముల పండ్లు తీసుకోవాలి. అయితే ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా ఐదుసార్లు తీసుకోవడం మంచిది. మీరు మాంసాహారులైతే మీ డైట్‌లో ఫిష్‌ను చేర్చుకోవచ్చు. అందులో ఉండే ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ గుండె సంబంధిత రోగాలను దూరం చేస్తాయి.

2) ఉప్పును తగ్గించండి : మీ రోజు వారీ ఆహారంలో భాగంగా మీరు తీసుకునే ఉప్పు 1 గ్రాము (ఒక టీస్పూన్)కి మించకూడదు. అలాగే సోడియం ఎక్కువగా ఉండే సోయా సాస్ వంటి వాటిని వాడవద్దు. సాల్టీ స్నాక్స్‌ను తగ్గించండి. ఇలా మీ డైట్‌లో సాల్ట్‌ను తక్కువగా వాడటం ద్వారా బీపీని కంట్రోల్‌లో పెట్టుకోవచ్చు. 

3) సుగర్ : మీ రోజు వారీ ఆహారంలో మీరు తీసుకునే సుగర్ 50 గ్రాములకు మించకూడదు. తీపితో కూడిన స్నాక్స్‌, కూల్‌ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవద్దు. తద్వారా డయాబెటీస్ వంటి దీర్ఘకాల రోగాలకు దూరంగా ఉండవచ్చు.

4) వాటర్ : ప్రతీరోజూ తప్పనిసరిగా 8 గ్లాసుల నీరు తాగాలి. రోగ నిరోధకతకు, చర్మ ఆరోగ్యానికి, కండరాల పనితీరుకు నీరు తప్పనిసరి. శరీరానికి సరిపోయేంత నీరు సేవించకపోతే డీహైడ్రేషన్, నీరసం, చర్మం పొడిబారడం, తలనొప్పి తదితర సమస్యల బారినపడే ప్రమాదం ఉంటుంది.

5) శారీరక వ్యాయామం : వారంలో కనీసం ఐదు రోజుల పాటు రోజుకు 30 నిమిషాలు శారీరక వ్యాయామం అవసరం. వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్ లేదా తేలికపాటి వ్యాయామాలు చేయాలి. వ్యాయామం ద్వారా శరీర బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు.

6) నిద్ర : ప్రతీ రోజూ తప్పనిసరిగా 7 లేదా 8 గంటలు నిద్రపోవాలి. నిద్రలేమితో బాధపడేవారిలో రోగనిరోధకత బలహీనపడే అవకాశాలు ఉంటాయి. మానసిక, శారీరక ఆరోగ్యానికి నిద్ర చాలా అవసరం.

7) స్మోకింగ్ వద్దు : స్మోకింగ్ అలవాటుకు దూరంగా ఉండాలి. స్మోకింగ్ ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉంటుంది. అంతేకాదు, స్మోకింగ్ వల్ల ఇతర అవయవాలు కూడా క్యాన్సర్ బారినపడే ప్రమాదం ఉంది. గుండె సంబంధిత వ్యాధులు కూడా అవకాశం ఉంటుంది. మీకే కాదు, స్మోకింగ్ మీ చుట్టూ ఉన్నవారి ఆరోగ్యానికి కూడా హానికరమే.

8) మద్యం సేవించవద్దు : విపరీతంగా మద్యం సేవించడం వల్ల కాలేయం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. లివర్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంటుంది. కాబట్టి మద్యానికి పూర్తిగా ఉండటం మంచిది.

9) హ్యాండ్ వాష్ : చేతులను తరచూ శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలి. ముఖ్యంగా ఆహారం తినేముందు తప్పనిసరిగా చేతులను సబ్బు లేదా శానిటైజర్‌తో శుభ్రపరుచుకోవాలి. 

10) ఒత్తిడి, ఆందోళన వద్దు : ఏ విషయంలోనూ ఎక్కువగా ఆందోళన చెందవద్దు. అనవసర ఆందోళనతో బీపీ లెవల్స్ పెరగడం లేదా ఇతర ఆరోగ్య (Health) సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నించాలి. మంచి సంగీతం వినడం, మీకు నచ్చిన ప్రదేశాల్లో గడపడం, మీకు నచ్చిన వ్యక్తులతో మాట్లాడటం ద్వారా ఒత్తిడి, ఆందోళనను దూరం చేసుకోవచ్చు.

Also Read: Foods For Warming The Body: చలికాలంలో శరీరానికి వెచ్చదనం ఇచ్చే ఆహారం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News