Beauty tips: రోజూ క్రమం తప్పకుండా ఇలా చేస్తే 50 ఏళ్లయినా నిత్య యౌవనం

Beauty tips: వయస్సు పెరిగే కొద్దీ వృద్ధాప్య లక్షణాలు ముఖంపై స్పష్టంగా కన్పిస్తుంటాయి. వయస్సును నియంత్రించలేకపోయినా..వృద్ధాప్య ఛాయల్ని మాత్రం నిలువరించవచ్చు. కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా ఏజీయింగ్ నియంత్రించవచ్చు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 10, 2024, 07:47 PM IST
Beauty tips: రోజూ క్రమం తప్పకుండా ఇలా చేస్తే 50 ఏళ్లయినా నిత్య యౌవనం

Beauty tips: ఏజీయింగ్ అనేది వయస్సుతో పాటు ఎదురయ్యే సమస్య. చర్మంపై వృద్ధాప్య ఛాయలు కన్పిస్తుంటాయి. కొన్ని రకాల చిట్కాలు పాటించడం ద్వారా ఏజీయింగ్ సమస్యకు చాలా సులభంగా చెక్ చెప్పవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. నిత్యం యౌవనంగా ఉంటూ మిళమిళమెరుస్తూ ఉండాలంటే ఈ చిట్కాలు పాటించాల్సిందే.

ఏజీయింగ్ సమస్యకు చెక్ పెట్టి..నిత్య యౌవనంగా ఉండాలంటే ముందుగా మార్కెట్‌లో లభించే కెమికల్ ఉత్పత్తులను దూరం పెట్టాలి. సహజసిద్దమైన ఆర్గానిక్ ఉత్పత్తులకే ప్రాధాన్యత ఇవ్వాలి. చర్మానికి నిగారింపు తీసుకొస్తుంది. కెమికల్ ఉత్పత్తుల్ని దరిచేరనివ్వకూడదు.

బాహ్య సౌందర్యం ఉండాలంటే ముఖ్యంగా కావల్సింది అంతర్గత ఆరోగ్యం. దీనికోసం డైట్ సరిగ్గా ఉండాలి. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు బ్యాలెన్సింగ్ డైట్ దోహదం చేస్తుంది. గోరు వెచ్చని నీళ్లే తాగుతుండాలి. ఇలా చేయడం వల్ల ప్రీ మెచ్యూర్ ఏజీయింగ్ దూరమౌతుంది. 

ఫేస్ మాస్క్ అనేది మార్కెట్‌లో లభించేది వినియోగించకూడదు. ఇంట్లో తయారు చేసుకోవాలి. మ్యాష్డ్ పొటాటో, అరటి పండు, తేనెతో చేసే ఫేస్ మాస్క్ మంచి ఫలితాలనిస్తుంది. చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు స్మూదీని మంచి ప్రత్యామ్నాయం. బెర్రీస్, అవకాడోతో చేసే స్మూదీ సేవించాలి. చర్మాన్ని మాయిశ్చరైజ్డ్ గా ఉంచాలి. డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి. డైట్‌లో కూడా తాజా పండ్లు, కూరగాయలు ఉండేట్టు చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మానికి అవసరమైన పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. 

రోజూ తగినంత సమయం వ్యాయామం లేదా వాకింగ్‌కు కేటాయించాల్సి ఉంటుంది. దీనివల్ల బాహ్యంగా, అంతర్గతంగా ఆరోగ్యం మెరుగుపడుతుంది. చర్మానికి నిగారింపు, అందం కోసం రోజూ వ్యాయామం చాలా అవసరం. దీనివల్ల శరీరం ఫిట్ అండ్ హెల్తీగా ఉంటుంది. శరీరంలో రక్త సరఫరా మెరుగ్గా ఉంటుంది. 

Also read: Health Benefits: ఈ సీజనల్ ఫ్రూట్ తింటే చాలు మలబద్ధకం, జీర్ణ సమస్యలు అన్నీ మటుమాయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News