Asthma Treatment with Vitamins: ఈ విటమిన్ లతో ఆస్తమాకు శాశ్వత పరిష్కారం

Vitamins for Asthma: శరీరంలో జరిగే అంతర్గత మార్పులు వివిధ రూపాల్లో బయటపడుతుంటాయి. ఇందులో కొన్ని దీర్ఘకాలిక సమస్యలకు దారితీస్తాయి. సకాలంలో జాగ్రత్తలు తీసుకుంటే దీర్ఘ కాలిక వ్యాధుల్నించి సైతం ఉపశమనం పొందవచ్చు. పూర్తి వివరాలు ఇలా...  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 2, 2023, 12:40 PM IST
Asthma Treatment with Vitamins: ఈ విటమిన్ లతో ఆస్తమాకు శాశ్వత పరిష్కారం

Vitamins for Asthma: దీర్ఘకాలిక వ్యాధుల్లో ముఖ్యమైనవి అధిక రక్తపోటు, మధుమేహం, రెస్పిరేటరీ వ్యాధులు, ఆస్తమా ఉన్నాయి. దేనికీ సరైన చికిత్స లేదు. ఎప్పటికప్పుడు మందులు వాడుతుంటే అదుపులో ఉంటాయి. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆస్తమాను నియంత్రించడమే కాదు..అదే పనిగా తీసుకునే ఇన్‌హేలర్ నుంచి విముక్తి పొందవచ్చు. 

ఆధునిక జీవన విధానంలో అధిక రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్ ఎలా వ్యాపిస్తున్నాయో ఆస్తమా ముప్పు కూడా అలానే పెరుగుతోంది. ఆస్తమా అనేది చికిత్స లేని వ్యాధి. ఒకసారి సోకిందంటే జీవితాంతం మందులు వాడాల్సిందే. ఇన్‌హేలర్ తీసుకోవల్సిందే. కానీ కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మాత్రం ఆస్తమాను పూర్తిగా నియంత్రణలో ఉంచుకోవచ్చు. మీరు చేయాల్సిందల్లా డైట్‌లో కొన్ని మార్పులు చేయడమే. ఆ వివరాలు తెలుసుకుందాం..

స్ట్రాబెర్రీ ఫ్రూట్స్ ఆస్తమా రోగులకు అద్భుతంగా దోహదపడతాయి. ఎందుకంటే ఇందులో  సమృద్ధిగా లభించే విటమిన్ సి ఊపిరితిత్తుల్ని సురక్షితంగా ఉంచుతుంది. ఆస్తమా సమస్యల్ని దూరం చేసేందుకు డైట్‌లో స్ట్రాబెర్రీ పండ్లను తప్పకుండా చేర్చుకోవాలి. ఆస్తమా వ్యాధి నియంత్రణలో స్ట్రాబెర్రీ అద్భుతంగా పనిచేస్తుంది. బరువు కూడా తగ్గించుకోవచ్చు. స్ట్రాబెర్రీ పండ్లను ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి.

Also Read: Summer Health Problems: ఎండాకాలంలో ఎండవేడితో వచ్చే జబ్బులు

యాపిల్ ఎ డే కీప్ డాక్టర్ ఎవే అన్నారు. వేరే విషయంలో ఏమో గానీ ఆస్తమా విషయంలో సరిగ్గా సరిపోతుంది ఈ క్యాప్షన్. ఆస్తమా లక్షణాల్ని తగ్గించుకుని ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు కనీసం ఒక యాపిల్ తినాలి. యాపిల్ అంత అద్భుతమైంది. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఇ పెద్దమొత్తంలో ఉంటాయి. ఊపిరితిత్తుల స్వెల్లింగ్ సమస్యను తగ్గిస్తుంది. ఆస్తమాను నియంత్రిస్తుంది. 

ఇక సిట్రస్ ఫ్రూట్స్‌లో ఆరెంజ్ ఆస్తమా వ్యాధిగ్రస్థులకు అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో పెద్దమొత్తంలో లభించే విటమిన్ సి ఊపిరితిత్తులు ఇన్‌ఫెక్షన్‌కు గురికాకుండా కాపాడుతుంది. రోజూ ఒక ఆరెంజ్ తినడం వల్ల ఆస్తమాను సులభంగా నియంత్రించవచ్చు

డైట్‌లో ఈ మార్పులతో పాటు ఆస్తమా రోగులు ప్రతి రోజూ ఉదయం లేదా సాయంత్రం లేదా రెండు పూట్లా కనీసం 15 నిమిషాలు బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ చేయాలి. దీనివల్ల ఊపిరితిత్తుల సామర్ధ్యం పెరుగుతుంది. రోజూ ఉదయం వేళ గోరువెచ్చని నీళ్లు తాగాలి. చల్లని నీళ్లు పొరపాటున కూడా తాగకూడదు. నార్మల్ వాటర్ మాత్రమే తీసుకోవాలి. ఆస్తమా కూడా డయాబెటిస్, కొలెస్ట్రాల్, రక్తపోటులా లైఫ్‌స్టైల్ వ్యాధి అయినందున నియంత్రణ పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది. 

Also Read: Healthy Liver Tips: రోజూ ఈ పదార్ధాలు తింటే లివర్ డ్యామేజ్ తప్పదు, వెంటనే దూరం చేయండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News