Health Tips: ఆధునిక బిజీ ప్రపంచంలో ప్యాక్డ్ ఫుడ్స్, ప్రోసెస్డ్ అండ్ ప్యాక్డ్ మీట్ వినియోగం గణనీయంగా పెరిగిపోయింది. ఎంత సౌకర్యవంతంగా ఉన్నా..ఆరోగ్యానికి అంతే హానికరంగా మారుతోంది. ఇందులో ఉండే ఫ్యాట్, సోడియం పరిమాణాలు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంటాయి.
గత కొద్దికాలంగా ప్రోసెస్డ్, ప్యాక్డ్ మీట్ వినియోగం పెరిగిపోయింది. ఇందులో ఫ్యాట్, సోడియంతో పాటు ల్యాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా కూడా ఉంటుంది. ఇది శరీరంపై తీవ్ర దుష్పరిణామాలకు కారణం కావచ్చు. ల్యాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా అనేది ప్రోసెస్డ్ మాంసంతో పాటు పికిల్స్, పెరుగు వంటి పర్మెంటెడ్ పదార్ధాల్లో ఉంటుంది. ఇందులో ల్యాక్టో బేసిల్లస్ సేక్, ల్యాక్టాబేసిల్లస్ కర్వాటస్, ల్యుకోనోస్టిక్ గెలిడియమ్, ల్యుకోనోస్టిక్ కరనోజమ్, ల్యుకోనోస్టిక్ మ్యాసెంటెరోయిడ్స్, ఎసైన్ టోబ్యాక్టర్, బెసిల్లస్, మైక్రోకోకస్, సెరేటియా, స్టెఫిలోకోకస్ ఉంటాయి.
వాస్తవానికి ల్యాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా మంచిదే. కానీ మోతాదు దాటితే మాత్రం హాని చేకూరుతుంది. బ్యాస్, బ్లోటింగ్ సమస్య ముందు నుంచే ఉండేవారికి ల్యాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా కారణంగా ఆ సమస్య మరింత పెరగవచ్చు. ఇలాంటివారిని 38 మందిపై అధ్యయనం జరపగా..అందులో అత్యధికులకు రక్తంలో ల్యాక్టిక్ యాసిడ్ పెరిగిపోవడాన్ని గమనించారు. చిన్న ప్రేవుల్లో బ్యాక్టిరియా స్థిరపడింది. కొంతమందిలో బ్రెయిన్ ఫాగ్, బ్లోటింగ్, గ్యాస్ లక్షణాలు మరింత పెరిగిపోయాయి.
ప్రో బయోటిక్స్ అనేవి శరీరం రోగ నిరోధక శక్తిపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. ప్రో బయోటిక్ సప్లిమెంట్స్ ఎక్కువగా సేవించేవారిలో ఎక్కువ నష్టం వాటిల్లుతుంది. అందుకే ఏదైనా తినేముందు వైద్యుని సలహా మేరకు తీసుకోవడం మంచిది.
Also read: Kidney Disease Signs: మీ శరీరంలో ఈ మార్పులు కన్పిస్తే అలర్ట్ అయిపోండి, కిడ్నీ వ్యాధి కావచ్చు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook