Diabetes Tips: ఇటీవలి కాలంలో మధుమేహంతో పాటు కొలెస్ట్రాల్, రక్తపోటు వ్యాధుల ముప్పు పెరుగుతోంది. ఫలితంగా హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వంటి ప్రాణాంతక సమస్యలు ఏర్పడుతున్నాయి. వైద్య నిపుణుల ప్రకారం మధుమేహం అనేది కేవలం మన అజాగ్రత్త వల్లనే వస్తుంది.
మధుమేహంలో రెండు రకాలుంటాయి. టైప్ 1, టైన్ 2 డయాబెటిస్ ఇందులో టైప్ 2 డయాబెటిస్ అరికట్టడమనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. హెల్తీ లైఫ్‌స్టైల్‌ని బట్టి ఆరోగ్యం ఉంటుంది. కొంతమంది రాత్రి వేళ సోషల్ మీడియాతో టైప్ పాస్ చేస్తూ త్వరగా పడుకోరు. ఫలితంగా ఉదయం ఆలస్యంగా నిద్రలేస్తుంటారు. రాత్రి త్వరగా పడుకుని, త్వరగా నిద్రలేస్తే ఆరోగ్యం బాగుంటుంది. ఉదయం 8.30 గంటల్లోగా బ్రేక్ ఫాస్ట్ పూర్తి చేస్తే ఆరోగ్యపరంగా చాలా చాలా ప్రయోజనమంటున్నారు వైద్య నిపుణులు. ఇది జరగాలంటే రాత్రి త్వరగా పడుకుని, ఉదయం త్వరగా లేవాల్సి ఉంటుంది.
ఈ అంశంపై 10,575 మందిపై శాంపిల్స్ సేకరించి చేసిన అధ్యయనం ప్రకారం టైప్ 2 డయాబెటిస్ సాధ్యాసాధ్యాల గురించి వెల్లడైంది. ఉదయం 8.30 గంటలకు బ్రేక్ఫాస్త్ పూర్తి చేస్తే..షుగర్ లెవెల్స్ పూర్తిగా నియంత్రణలో ఉంటాయని తేలింది. అదే సమయంలో ఇన్సులిన్ నిరోధకత తగ్గిందని గుర్తించారు. తినే బ్రేక్‌ఫాస్ట్‌లో కూడా పిండి పదార్ధాలు, కొవ్వు, ప్రోటీన్లు అధికంగా ఉండేట్టు చూసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల రక్తంలో బ్లడ్ షుగర్ లెవెల్ తగ్గుతుంది.
అన్నింటికీ మించి చాలామంది బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేస్తుంటారు. ఉదయ ఆలస్యంగా లేవడం వల్ల బ్రేక్‌ఫాస్ట్ మానేస్తుంటారు. ఇది ఏమాత్రం మంచి అలవాటు కాదు. దీనివల్ల భవిష్యత్తులో చాలా రోగాలు తలెత్తవచ్చు. బ్రేక్‌ఫాస్ట్ గట్టిగా తిని..మద్యాహ్నం, రాత్రి భోజనం తగ్గించాలి. రాత్రి వేళ్ 7-8 గంటల నిద్ర తప్పకుండా ఉండాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల టైప్ 2 డయాబెటిస్‌ను పూర్తిగా నివారించవచ్చు.
Also read: Nipah Virus: నిఫా వైరస్ కరోనా కంటే ప్రమాదకరమా, ఐసీఎంఆర్ ఏమంటోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook