Immunity Power: కరోనా మహమ్మారి ఉధృతంగా విస్తరిస్తోంది. ప్రతిరోజూ కేసుల సంఖ్య పెరుగుతోంది. కరోనా సెకండ్ వేవ్ ధాటికి జనం విల్లవిల్లాడుతున్నారు. రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడం ఒక్కటే పరిష్కారంగా కన్పిస్తున్నప్పుడు..ఆ శక్తి ఎలా వస్తుంది.
దేశంలో కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave) భయంకరంగా మారిపోయింది. రోజురోజుకూ దేశంలో కరోనా పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. కోవిడ్ బారిన పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.18 ఏళ్లు దాటినవారికి వ్యాక్సిన్ ఇస్తున్నారు. మరి 18 ఏళ్ల లోపున్నవారి సంగతేంటనేది ఇంకా నిర్ధారణ కాలేదు. మరి 18 ఏళ్ల లోపు వయస్సున్నవారు కరోనా నుంచి ఎలా రక్షించుకోవాలి. సమాధానం ఒక్కటే..రోగ నిరోధక శక్తి (Immunity power) పెంపొందించుకోవడం. సరైన పోషక పదార్ధాలున్న ఆహారం ఇవ్వడం ద్వారా పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెంచవచ్చు.రోగ నిరోధక శక్తిని పెంచే ఆ ఆహారపదార్ధాల వివరాలిలా ఉన్నాయి.
1. గుడ్లు (Eggs) తినడం వల్ల శరీరానికి విటమిన్ డి అందుతుంది. విటమిన్ డి తక్కువగా ఉన్న పిల్లలే తరచూ జ్వరం బారిన పడుతుంటారు. విటమిన్ డి ఉదయం పూట సూర్యరశ్మిలో లేదా కొన్ని రకాల ఆహారపదార్ధాల్లో లభ్యమవుతుంది. గుడ్లలో విటమిన్ డి (Vitamin D) తో పాటు విటమిన్ బి, ఈ, సెలీనియం ఉన్నాయి. ఇవి రోగ నిరోధక శక్తి పెంచడానికి ఉపయోగపడుతాయి.ఇక ఆకుకూరల్లో పాలకూర ( Leafy Vegetables)ను మించింది లేదు. పాలకూరలో ఇమ్యూన్ సిస్టమ్‌ని బలపరిచే మినరల్స్, విటమిన్స్ ఉన్నాయి. పాల కూరలో విటమిన్స్ ఏ, సీ, ఈ, కే, ఫోలేట్, మాంగనీస్, జింక్, సెలీనియం, ఐరన్ ఉంటాయి. వారానికి 2-3 సార్లు పాలకూర తినడం అలవాటుగా చేసుకుంటే చాలా మంచిది. త్వరగా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
2.హైలీ ప్రొటీన్డ్ ఫుడ్‌గా పప్పులున్నాయి. అన్ని రకాల పప్పుల్లోనూ ప్రొటీన్, ఫైబర్, ఫోలేట్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, జింక్, పొటాషియం ఉంటాయి. పప్పుల్లో ఉండే ఫైటో కెమికల్స్ శరీరం రోగాల బారిన పడకుండా కాపాడతాయి. బాదం పప్పుు అద్భుతమైన ఔషధం. ఇందులో విటమిన్ ఈ, మాంగనీస్ ఉంటాయి. ఇవి ఇమ్యూన్ సిస్టమ్ మరింత బలంగా ఉండేందుకు సహయపడతాయి. అయితే బాదం పప్పును 4-5 గంటలు నానబెట్టి లేదా రాత్రి పూట నానబెట్టి ఉదయం తొక్క తీసి ఇస్తే మంచిది.
3.పెరుగు ( Curd) రోగ నిరోధక శక్తి పెరగడానికి దోహదపడుతుంది.ఇందులో ఉండే హెల్దీ బ్యాక్టీరియా గట్ హెల్త్‌ని కాపాడుతుంది.దీని వల్ల అనేక వ్యాధులు మనని దరి చేరకుండా ఉంటాయి. మజ్జిగ రూపంలో అయినా తీసుకోవచ్చు. మజ్జిగ చేసి తాగించవచ్చు. కొన్ని రకాల సీడ్స్ కూడా ఇమ్యూనిటీ పవర్ పెంచేందుకు ఉపయోగపడుతాయి. ముఖ్యంగా గుమ్మడి విత్తనాలు, సన్ ఫ్లవర్ విత్తనాలు, ఫ్లాక్స్ సీడ్స్ వంటివి ఇమ్యూనిటీ బూస్టింగ్‌గా పని చేస్తాయి. ఇవి తీసుకోవడం వల్ల విటమిన్ ఈ, జింక్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అందుతాయి.
4. సిట్రస్ ఫ్రూట్స్‌గా పిల్చుకునే కమలా పండు, బత్తాయి పండు(Orrange), జామల్లో విటమిన్ సీ ( Vitamin C) సమృద్ధిగా లభిస్తుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్స్‌ని కలిగి ఉంటుంది, ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. అంతే కాక విటమిన్ సీ బాడీ పోషకాలని గ్రహించేందుకు దోహదపడుతుంది. పచ్చి బఠానీలు కూడా శరీరానికి చాలా బలం.ఇందులో విటమిన్ ఏ, బీ1, బీ6 సమృద్ధిగా ఉంటాయి.అంతేకాకుండా ఇందులో ఉండే పాలిఫెనాల్స్,కెరోటినాయిడ్స్,ఫ్లేవనాయిడ్స్ శరీరంలో ఇమ్యూనిటీని పెంచుతాయి.
Also read: Health Tips: ఉప్పు అధికంగా తింటే Heartకు ముప్పు అంటున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook