High Cholesterol: మారుతున్న జీవనశైలి కారణంగా చాలా మంది అధిక కొలెస్ట్రాల్ సమస్యలను ఎదుర్కొంటున్నారు. అనారోగ్యకరమైన ఫాస్ట్, జంక్ ఫుడ్స్ తినడం వల్లే ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా అధిక రక్తపోటు, గుండెపోటు, కరోనరీ ఆర్టరీ వ్యాధి, ట్రిపుల్ నాళాల వ్యాధి వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తీసుకోండి:
కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండాలంటే ఆహార విషయాల్లో శ్రద్ధ వహించాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అలాగే ధూమపానం, ఆల్కహాల్ తాగడం వంటివి మానేయాలని ఆరోగ్య నిపుణుల అభిప్రాయపడుతున్నారు. శరీరంలో కొలెస్ట్రాల్‌ను నియంత్రించేందుకు కొన్ని ప్రొటీన్లు ఉండే ఆహారాలను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
1. డ్రై ఫ్రూట్స్:
డ్రై ఫ్రూట్స్‌లో ప్రొటీన్లు పుష్కలంగా లభిస్తాయి. ముఖ్యంగా బాదం, వాల్‌నట్స్, పిస్తా వంటి పోషకాలు అధికంగా ఉండే డ్రై ఫ్రూట్స్‌ను తింటే, అది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి సహాయపడుతుంది.
2. కాయధాన్యాలు:
కెనడియన్ మెడికల్ అసోసియేషన్ పరిశోధన ప్రకారం.. కాయధాన్యాల వినియోగం ద్వారా చెడు కొలెస్ట్రాల్‌లో 5 శాతం తగ్గుతుందని పేర్కొంది. కాబట్టి రోజువారీ ఆహారంలో ఖచ్చితంగా కాయధాన్యాలను తీసుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు.
3. సాల్మన్ ఫిష్:
నాన్-వెజ్ తినడానికి ఇష్టపడే వారు.. సాల్మన్ ఫిష్‌ను తినోచ్చని నిపుణులు చెబుతున్నారు. దీనిని ప్రోటీన్ రిచ్ ఫుడ్‌గా కూడా పిలుస్తారు. ఇందులో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వు చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది.
4. ఓట్స్:
ఓట్స్ శరీరాని చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఇది శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రిండానికి ప్రభావవంతంగా పనిచేస్తుంది.
5. సోయా ప్రోటీన్:
సోయా ప్రొటీన్‌తో తయారు చేసిన టోఫు శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను చేకూర్చుతుంది. అయితే ఇది గుండెలో ఉన్న సిరల్లో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి సహాయపడుతుంది.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Male Fertility: పెళ్లైన మగవారు పచ్చళ్లు తినడం మానుకోవాలి? లేకపోతే సంతానోత్పత్తిపై ప్రభావం తప్పదు..!
Also Read: Male Fertility: పాలలో ఇది కలిపి తాగితే పురుషులలో స్పెర్మ్ కౌంట్ ఘనీయంగా పెరుగుతుంది..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook