Papaya Leaf Benefits: బొప్పాయిలో మన శరీరానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఖనిజాలు బయో యాక్టివ్ కాంపౌండ్స్ ఉంటాయి. దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు.. అయితే, బొప్పాయి ఆకుల్లో కూడా పోషకాలు పుష్కలం. వీటితో జ్యూస్ తయారు చేసుకుని తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. బొప్పాయి ఆకులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, జీరో ఫ్యాట్ ఉంటుంది. అంతేకాదు బొప్పాయి ఆకుల్లో విటమిన్ ఏ, సీ, విటమిన్ బి కాంప్లెక్స్ ఉంటాయి. బొప్పాయి ఆకులతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి? తెలుసుకుందాం..
బొప్పాయి ఆకుల్లో ఐరన్, మెగ్నీషియం, క్యాల్షియం ,పొటాషియం, ఫాస్ఫరస్, జింక్ పుష్కలంగా ఉంటాయి. వీటిని నీటిలో కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు మెండు. వారంలో మూడు రోజులు ఉదయం పరగడుపున బొప్పాయి ఆకు రసం తీసుకోవడం మేలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
బొప్పాయి ఆకులో యాంటీ ఆక్సిడెంట్, విటమిన్ సి, విటమిన్ ఇ ఉంటుంది. ఇవి కాకుండా కాపాడుతుంది బొప్పాయి ఆకులను రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను నివారిస్తుంది. ఇది ఫ్రీ రాడికల్ డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. బొప్పాయి ఆకులో యాంటీ ఆక్సిడెంట్లు ప్రాణాంతక గుండె డయాబెటీస్ సమస్యలు రాకుండా నివారిస్తుంది. బొప్పాయి ఆకులు క్యాన్సర్ వ్యతిరేకంగా కూడా పోరాడతాయి. బొప్పాయి ఆకులు పేగు ఆరోగ్యానికి కూడా తోడ్పడతాయి.. ఇది కడుపులో అజీర్తి, గ్యాస్ తొలగించి మలబద్దక సమస్యకు మంచి రెమెడీగా పనిచేస్తుంది..
బొప్పాయి ఆకుల జ్యూస్ తీసుకోవటం వల్ల ఆస్తమాకు మంచి రెమెడీ. ఇందులో ఇన్ఫ్లమేషన్ గుణాలు ఉంటాయి. ఈ ఆకులో యాంటీ ఇన్ఫ్లమేటరి గుణాలు ఫ్లేవనాయిడ్స్, ఇన్ఫ్లమేషన్ సమస్యను తగ్గిస్తాయి. బొప్పాయి లివర్‌ను డిటాక్స్ చేస్తుంది. మన శరీరం నుంచి విష పదార్థాలు బయటికి పంపిస్తుంది. అంతేకాదు ఇది లివర్ పనితీరును కూడా మెరుగు చేస్తుంది.
బొప్పాయి ఆకులోని విటమిన్స్ చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. సెల్ డామేజ్ కాకుండా నివారిస్తుంది. కొల్లాజెన్ ఉత్పత్తికి నాచురల్ గా తోడ్పడుతుంది. దీంతో ముఖం పై మచ్చలు, గీతలు రాకుండా ఉంటాయి.
ఇదీ చదవండి: ఎగ్ షెల్స్ జుట్టుకు ఇలా వాడారంటే.. వద్దన్నా మీ జుట్టు పెరుగుతూనే ఉంటుంది..
బొప్పాయి ఆకుల రసం రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. ఇన్సులిన్ నిరోధకతను మెరుగు చేస్తుంది. దీంతో రక్తంలో చక్కెర అదుపులో ఉంటుంది. అంతేకాదు ఇందులో ఇమ్యూనిటీ బూస్టింగ్ గుణాలు ఉంటాయి. బొప్పాయి ఆకులో విటమిన్ ఏ,సీ ఉంటాయి.. ఇది ఆక్సిడేటివ్స్ రాకుండా ఇమ్యూనిటీని పెంచుతాయి.
బొప్పాయి ఆకుల రసం తయారు చేసే విధానం..
బొప్పాయి ఆకులను శుభ్రంగా కడిగి చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మూడు కప్పుల నీటిలో వేసి మరిగించుకోవాలి ..చల్లారిన తర్వాత వడకట్టుకొని ఉదయం పరగడుపున తీసుకోవాలి. దీంట్లో తేనే లేదా నిమ్మరసం కలుపుకొని తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు మెండు.
ఇదీ చదవండి: బొప్పాయి ఈ పండుతో పొరపాటున తినకూడదు.. కడుపునొప్పి గ్యారెంటీ..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.