Black Fungus:మధుమేహం నియంత్రణలో లేని మరియు దీర్ఘకాలికంగా ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)లో ఉన్న COVID-19 బాధితులలో Mucormycosis అనే అనే నల్లటి ఫంగల్ ఇన్ఫెక్షన్ గుర్తించారు. తొలి దశలోనే దీన్ని గుర్తించకపోతే కంటిచూపు పోతుందని కేంద్రం తెలిపింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరియు ICMR కరోనా పేషెంట్లలో ఈ వ్యాధిని పరీక్షించాలని చెబుతున్నాయి.
బ్లాక్ ఫంగస్ ఇన్‌ఫెక్షన్ Mucormycosisను త్వరగా గుర్తించి చికిత్స అందించకపోతే కంటిచూపు కోల్పోతున్న కేసుల్ని గుర్తించారు. అవి ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయిని సూచించారు. కేవలం డయాబెటిస్ నియంత్రణలో లేని వారు, స్టెరాయిడ్స్ తీసుకుంటున్న వారు, దీర్ఘకాలికంగా ఐసీయూలో చికిత్స పొందుతున్న కరోనా వైరస్(CoronaVirus) బాధితులలో ఈ లక్షణాలు గుర్తించి చికిత్స అందించాలని ప్రకటనలో తెలిపింది. కొన్ని రకాల స్టెరాయిడ్స్, నెక్రోటిక్ పదార్థాలు, రోగనిరోధక శక్తిని పెంచే ఔషధాలు అధికంగా తీసుకోవడం మరింత ప్రభావం చూపుతుందని సూచించింది. ఇందుకు సంబంధించి DO'S మరియు DON'TSను వైద్యశాఖకు తెలిపారు.
Also Read: RT-PCR Tests: ఆర్‌టీ-పీసీఆర్ టెస్టులు వీరికి చేయకూడదు, ICMR తాజా మార్గదర్శకాలు విడుదల
పాటించాల్సినవి (DO'S)
- Hyperglycemiaను ఎలాగైనా సరే నియంత్రించాలి
- డయాబెటిస్ (Diabetics) పేషెంట్లు మరియు కోవిడ్19 నుంచి కోలుకున్న వారిలో రక్తంలో చక్కెర, గ్లూకోజ్ స్థాయిని నియంత్రించుకోవాలి
- స్టెరాయిడ్స్‌ను తగిన సమయంలో, తగిన మోతాదులో, సరైన కాల వ్యవధిలో ఉపయోగించాలి
- ఆక్సిజన్ థెరపీలో భాగంగా పరిశుభ్రమైన, స్టెరిలైట్ వాటర్‌లో humidifiers ఉంచాలి.
- యాంటీబయాటిక్స్ లేదా యాంటీఫంగల్స్‌ను అవసరమైన సందర్భంలో వినియోగించాలి.
Also Read: Immunity Power: మీ చిన్నారులకు ఇవి తినిపిస్తే చాలు..కరోనా దరిచేరదిక
Evidence based Advisory in the time of #COVID-19 (𝐒𝐜𝐫𝐞𝐞𝐧𝐢𝐧𝐠, 𝐃𝐢𝐚𝐠𝐧𝐨𝐬𝐢𝐬 & 𝐌𝐚𝐧𝐚𝐠𝐞𝐦𝐞𝐧𝐭 𝐨𝐟 𝐌𝐮𝐜𝐨𝐫𝐦𝐲𝐜𝐨𝐬𝐢𝐬) @MoHFW_INDIA @PIB_India @COVIDNewsByMIB @MIB_India #COVID19India #IndiaFightsCOVID19 #mucormycosis #COVID19Update pic.twitter.com/iOGVArojy1
— ICMR (@ICMRDELHI) May 9, 2021
చేయకూడనివి (DON’TS)
- కరోనా వైరస్ సోకిన లక్షణాలు, ఇతరత్రా ఎలాంటి సంకేతాలు మీరు గుర్తించిన నిర్లక్ష్యం వహించకూడదు
- ముక్కులో గాలి వెళ్లకుడా ఇబ్బంది కలిగిన అన్ని సందర్భాలను బ్యాక్టీరియా సైనసిటిస్ కేసులుగా పరిగణించవద్దు, ముఖ్యంగా రోగనిరోధక శక్తి తగ్గడం లేదా COVID-19 రోగుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి
- ఫంగల్ ఇన్‌ఫెక్షన్‌ను గుర్తించేందుకు పూర్తి వివరాలు కనుక్కోవడానికి, టెస్టులు చేయించుకోవడానికి అసహనంగా వ్యవహరించకూడదు
- ముకోర్మైకోసిస్ (Mucormycosis) చికిత్సను ప్రారంభించడానికి కీలకమైన సమయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వృథా చేయకూడదు
Also Read: Corona Third Wave: కరోనా థర్డ్ వేవ్ తప్పదు, ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్న నిపుణులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook