Water Melon Benefits: వేసవి వచ్చేసింది. ఎండలు మండిపోతున్నాయి. వేసవి వేడి నుంచి ఉపశమనం కోసం ప్రతి ఒక్కరూ సమ్మర్ ఫ్రూట్స్‌ని ఆశ్రయిస్తున్నారు. అందులో ముఖ్యమైంది పుచ్చకాయ. పుచ్చకాయతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో చూద్దాం..
వేసవి ప్రత్యేక సీజనల్ ఫ్రూట్ పుచ్చకాయలు. వేసవి ఎండల్నించి కాపాడుకునేందుకు, వేడి చేయకుండా సంరక్షించుకునేందుకు పుచ్చకాయలు అద్భుతంగా పనిచేస్తాయి. వడగాల్పులున్నప్పుడు శరీరం వడదెబ్బకు గురికాకుండా శరీరాన్ని పుచ్చకాయలు హైడ్రేట్ చేస్తాయి. రుచితో పాటు ఆరోగ్యానికి లాభదాయకమైన పుచ్చకాయతో కలిగే ఇతర ప్రయోజనాలు తెలుసుకుందాం.
పుచ్చకాయలు మిగిలిన అన్ని సమ్మర్ ఫ్రూట్స్‌తో పోలిస్తే..అత్యధిక మొత్తంలో నీటిశాతం ఉన్నది ఇదే. అందుకే దీన్ని సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ అని పిలుస్తారు. వేసవి వచ్చిందంటే చాలు పుచ్చకాయలకు డిమాండ్ పెరిగిపోతుంది కూడా. పుచ్చకాయలో 92 శాతం నీరే ఉంటుంది. అందుకే తరచూ తీసుకుంటే..ఆనారోగ్య సమస్యలు తలెత్తవు. ఒంట్లో వేడిని కూడా చల్లార్చుతుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. పుచ్చకాయలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయని చాలా తక్కువమందికి తెలుసు. ఇందులో ఒక మనిషికి రోజుకు అవసరమైన 16 శాతం విటమిన్ సి ఉంటుంది. మనిషి శరీరంలో తెల్లరక్తకణాల్ని ఉత్పత్తి చేసేందుకు విటమిన్ సి చాలా అవసరం. ఫలితంగా శరీరాన్ని ఇతర ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. జలుబు నుంచి తక్షణ ఉపశమనం పొందాలంటే..పుచ్చకాయ చాలా మంచిదంటున్నారు న్యూట్రిషియనిస్టులు.
శరీరం ఎక్కువగా అలసిపోయినప్పుడు లేదా వ్యాయామం చేసినప్పుడు పుచ్చకాయ తీసుకుంటే తక్షణ శక్తి లభిస్తుంది. ఇందులో ఉండే సిట్రులైన్ అనే పదార్ధం శరీరానికి అవసరమైన ఎమైనో ఆమ్లాల వినియోగాన్ని పెంచుతాయి. వ్యాయామం అనంతరం పుచ్చకాయ తింటే..కండరాలు బలపడతాయి. అటు గ్రోత్ హార్మోన్ స్థాయి కూడా పెరుగుతుంది. ఇక పుచ్చకాయలో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా వృద్ధాప్యపు ఛాయలు తగ్గుతాయి. పుచ్చకాయంలో అధికంగా ఉండే లైకోపిన్..గుండెను ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ పెంచేందుకు దోహదపడుతుంది. పుచ్చకాయ క్రమం తప్పకుండా తీసుకుంటే..కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
పుచ్చకాయలో ఉండే బీటా కెరోటిన్, లూటిన్, విటమిన్ సి, జియాక్సంతిన్ వంటి పోషక పదార్ధాల వల్ల కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. కంటిలోపలి మచ్చలు దూరమౌతాయి. గ్లైకోమా, ఆప్టిక్ నెర్వ్స్, డ్రై ఐస్ కోసం పుచ్చుకాయలు మంచివి.
Also read: Finger Millets: రాగులతో అద్భుత లాభాలు, కేన్సర్‌కు కూడా చెక్ పెట్టవచ్చు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.