Nutmeg Benefits: ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు పాలను తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇదే పాలలో అర టీ స్పూన్ జాజికాయ పొడిని కలుపుకుని తాగడం వల్ల రెట్టింపు లాభాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా శీతాకాలంలో ప్రతి రోజు ఇలా పాలలో జాజికాయ పొడిని కలుపుకుని తాగడం వల్ల అన్ని రకాల సీజన్ వ్యాధుల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా శరీరానికి ఇతర లాభాలు కూడా కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు.
నిద్రలేమి సమస్య నుంచి ఉపశమనం:
ప్రస్తుతం చాలా మందిలో రాత్రి నిద్రలేమి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అయితే ఇలాంటి సమస్య నుంచి ఉపశమనం పొందడానికి ప్రతి రోజు పాలలో చిటికెడు జాజికాయ పొడిని మిక్స్ చేసుకుని తీసుకుంటే మంచి సులభంగా మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు ఒత్తిడి సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకండా నిద్రలేమి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.
నొప్పుల నుంచి విముక్తి:
జాజికాయలో వివిధ రకాల ఆయుర్వేద గుణాలు లభిస్తాయి. కాబట్టి ఇది శరరీంలోని రోగనిరోధక శక్తిని పెంచి..కండరాల నొప్పుల నుంచి విముక్తి కలిగిస్తుంది. అంతేకాకుండా కీళ్ల నొప్పుల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. తీవ్ర నొప్పు ఉన్న చోట జాజికాయ నూనెను అప్లై చేస్తే మంచి ఫలితాలు పొందుతారు.
జలుబు, దగ్గు నుంచి ఉపశమనం:
జలుబు, దగ్గు సమస్య బాధపడుతున్నవారు ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు జాజికాయను పాలలో మిక్స్ చేసి తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా జ్వరం నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది.
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
జీర్ణక్రియ ఉపశయనం లభిస్తుంది:
పాలలో జాజికాయ పొడిని కలుపుకొని తాగడం వల్ల గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు దూరమవుతాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు జీర్ణక్రియ సమస్యలు కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది.
చర్మ సమస్యలకు చెక్:
ప్రతి రోజు జాజికాయ పొడిలో పాలను పోసుకుని మిశ్రమంలా తయారు చేసి మూఖానికి అప్లై చేస్తే చర్మ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అంతేకాకుండా ఈ మిశ్రమాన్ని జుట్టుకు కూడా వినియోగించవచ్చు. ఇలా వినియోగించడం వల్ల మంచి లాభాలు పొందుతారు.
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter