Omega 3 Fatty Acids: ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్.పేరులో సౌండ్ ఉన్నట్టే అద్భుత ఔషధం. ఆరోగ్యానికి ఎంతగా మేలు చేస్తుందో ఊహించలేం కూడా. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కోసం ఏయే ఆహార పదార్ధాలు తీసుకోవాలో తెలుసుకుందాం..
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలు చేకూరుస్తుంది. సరైన పద్ధతిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తీసుకుంటే ప్రమాదకరమైన గుండెపోటు ముప్పు దూరమౌతుంది. శరీరంలో ఇమ్యూనిటీ పెంచేందుకు దోహదపడుతుంది. దాంతో పాటు శరీరంలో సెల్స్ కూడా యాక్టివ్ అవుతాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఏయే ఆహార పదార్ధాల్లో పుష్కలంగా లభిస్తుందో చూద్దాం..
ఫ్లెక్స్ సీడ్స్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పొందేందుకు ఫ్లెక్స్ సీడ్స్ పౌడర్ చేసుకుని.. లేదా నేరుగా గింజల్ని తినవచ్చు. రోజకు ఒకసారి పరగడుపున తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. మరో ముఖ్యమైన డ్రై ఫ్రూట్ వాల్‌నట్. వాల్‌నట్ ఆరోగ్యానికి చాలా మంచిది. రోజూ క్రమం తప్పకుండా వాల్‌నట్ తీసుకుంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కొరత ఉండదు. అయితే వేసవిలో మాత్రం ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు.
గుడ్లలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి.అందుకే గుడ్లు తింటే రోజంతా యాక్టివ్‌గా ఉండగలరు. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. పాలు ఆరోగ్యానికి మంచివని అందరికీ తెలుసు. కానీ ఆవుపాలు తీసుకుంటే మాత్రం అదనంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి.ఇక మరో పదార్ధం సోయాబీన్. సోయాబీన్ అనేది ప్రోటీన్లు పుష్కలంగా ఉండే ఆహారం. సోయాబీన్ తినడం వల్ల శరీరానికి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి.
Also read: White Hair: తెల్లజుట్టు సమస్య నుంచి ఎలా ఉపశమనం, నేచురల్ పద్ధతులేమున్నాయి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి