Reduce Belly Fat: ప్రస్తుతం చాలా మంది అనారోగ్యకరమైన ఆహారాలు విపరీతంగా తీసుకోవడం వల్ల నడుము చుట్టూ కొలెస్ట్రాల్ పరిమాణాలు విచ్చలవిడిగా పెరుగుతుంది. అయితే ఇలాంటి సమస్యలు అనారోగ్యకరమైన ఆహారాల కారణంగా కూడా వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా శరీర ఆకృతి కూడా దెబ్బతింటుంది. కాబట్టి పొట్ట చుట్టు కొలెస్ట్రాల్, శరీర బరువును నియంత్రించుకోవడానికి తప్పకుండా పలు చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రతి రోజు ఆరోగ్యకరమైన ఆహారాలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది.
బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి చిట్కాలు:
గ్రీన్ టీ:
పాలు, చక్కెర లేని గ్రీన్ టీని తాగడం వల్ల కూడా బెల్లీ ఫ్యాట్‌ను నియంత్రించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ప్రతి రోజు ఈ టీని బెల్లీ ఫ్యాట్ నియంత్రించుకోవడానికి కేవలం ఖాళీ కడుపుతో మాత్రమే తాగాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు శరీర బరువును కూడా సులభంగా నియంత్రిస్తాయి.
లెమన్ వాటర్:
ఖాళీ కడుపుతో ప్రతి రోజు లెమన్ వాటర్ తాగడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు బెల్లీ ఫ్యాట్‌ను కూడా సులభంగా నియంత్రిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి బరువు తగ్గడానికి ప్రతి ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో నిమ్మకాయను పిండుకుని, బ్లాక్ సాల్ట్ కలుపుకుని తాగాలి.
సోంపు నీరు:
జీర్ణక్రియ సమస్యలతో బాధపడుతున్నవారికి సోంపు నీరు ప్రభావంతంగా సహాయపడుతుంది. ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు బెల్లీ ఫ్యాట్‌ను కూడా నియంత్రిస్తుంది. కాబట్టి శరీర ఆరోగ్యంగా ఉండడానికి సోంపు నీరును ప్రతి రోజు తీసుకోవాల్సి ఉంటుంది.
జీలకర్ర నీరు:
బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించేందుకు జీలకర్ర నీరు కూడా సహాయపడుతుంది. కాబట్టి ప్రతి రోజు భోజనం చేసిన తర్వాత జీలకర్ర నీరు తాగడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా పొట్ట తగ్గి బెల్లీ ఫ్యాట్ సమస్యలు కూడా దూరమవుతాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి