High Cholestrol Symptoms: కొలెస్ట్రాల్ అనగానే మనలో సానుకూల ఆలోచనలు కలుగుతాయి. ఇది రక్త కణాల్లో ఉండే జిగట పదార్ధం, రక్తంలో మంచి కొలెస్ట్రాల్ ఉంటే అది కొత్త కణాల నిర్మాణంలో ఉపయోగపడుతుంది. కానీ మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే మొదటగా వచ్చే సమస్య అధిక రక్తపోటు,తర్వాత గుండెపోటు, కరోనరీ ఆర్టరీ, ట్రిపుల్ నాళాల వ్యాధి మరియు మధుమేహం వంటి వ్యాధుల భయం ఏర్పడుతుంది. సాధారణంగా అనారోగ్యకరమైన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లను అనుసరించడం వల్ల శరీరంలో అధిక కొలెస్ట్రాల్ సమస్య పెరుగుతుంది. ప్రస్తుతకాలంలో శారీరక శ్రమ కూడా చాలా తగ్గిపోయాయి ఫలితంగా అధిక కొలెస్ట్రాల్ వంటి సమస్యలు భారినపడాల్సి వస్తుంది.
అధిక కొలెస్ట్రాల్ ని గుర్తించటం ఎలా..?
అధిక కొలెస్ట్రాల్ యొక్క నిర్దిష్ట లక్షణాలు బ్లడ్ టెస్ట్ ద్వారానే తెలుస్తాయి. అయితే ఈ సమస్య కలిగినప్పుడు మన శరీరం కొన్ని సంకేతాలను బహిర్గతం చేస్తుంది. రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ లక్షణాలను కాళ్ళల్లో వచ్చే కొన్ని మార్పుల ద్వారా గుర్తించవచ్చు. శరీరంలో కొలెస్ట్రాల్ సమస్య స్థాయిలు పెరిగినపుడు పెరిఫెరల్ ఆర్టరీ వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది. దీని వల్ల శరీరంలోని అనేక భాగాలలో తిమ్మిరికి లోనవుతాయి.
పెరిఫెరల్ ఆర్టరీ వ్యాధి అంటే ఏమిటి..?
శరీరంలో అనేక భాగాలకు రక్తాన్ని సరఫరా చేసే రక్త నాళాల్లో కొలెస్ట్రాల్ వంటి ఫలకం పేరుకుపోవడాన్ని పెరిఫెరల్ ఆర్టరీ వ్యాధి అంటారు. దీని వల్ల కాళ్ళ వరకు రక్తం సరఫరా అవ్వడంలో ఇబ్బందులు కలుగుతాయి. దీని కారణంగా కాళ్ళల్లో అనేక మార్పులు సంభవిస్తాయి.
Also Read: 7th Pay Commission: ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యగమనిక.. నిబంధనల్లో మార్పు
అధిక కొలెస్ట్రాల్ కలిగినప్పుడు కాళ్ళల్లో కనిపించే సంకేతాలు
కాళ్ళకు రక్తం సరఫరా అవ్వడంలో ఇబ్బందులు కలిగినప్పుడు, శరీరం యొక్క దిగువ భాగంలో నొప్పి పెరిగిపోతుంది. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఆక్సిజన్ పరిమాణం కూడా తక్కువ అవ్వడం మొదలు అవుతుంది. ఆ పరిస్థితుల్లో తొడలు మరియు కాళ్లల్లో తిమ్మిరి సమస్య పెరుగుతాయి. దీని వల్ల కాళ్ళ యొక్క చర్మం మరియు గోళ్లు పసుపు రంగులోకి మారవచ్చు. అంతేకాకుండా కాళ్ళ ఉష్ణోగ్రతలో కూడా మార్పులు ఏర్పడతాయి మరియు ఎక్కువగా కళ్ళు కాళ్ళు చల్లబడతాయి. ఇలాంటి మార్పులు కాళ్లల్లో సంభవిస్తే వెంటనే వైద్యున్ని సంప్రదించి.. అధిక కొలెస్ట్రాల్ సమస్యని తగ్గించే ప్రక్రియ ప్రారంభించాలి.
Also Read: Jio AirFiber Launch: వినాయక చవితి కానుకగా జియో ఎయిర్ ఫైబర్ లాంచ్‌కు అంతా సిద్ధం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook