Protein: ప్రోటీన్‌ పుష్కలంగా ఉండే పండ్లు.. గుండె ఆరోగ్యానికి మేలు..

Protein Source Fruits: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఆహారాలు డైట్‌లో చేర్చుకోవడం వల్ల మన శరీర ఆరోగ్యానికి మేలు చేస్తాయి. నాన్ వెజ్ లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. అయితే వెజిటేరియన్స్ వాళ్లకు కూడా ప్రోటీన్స్ కొన్ని రకాల పండ్లలో ఉంటాయి. వీటిని డైలీ రొటీన్‌లో చేర్చుకోవడం ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా ఇందులో ఖనిజాలు కూడా కలిగి ఉండటం వల్ల శరీరారోగ్యానికి మేలు చేస్తాయి.

Written by - Renuka Godugu | Last Updated : Jan 30, 2025, 10:49 AM IST
Protein: ప్రోటీన్‌ పుష్కలంగా ఉండే పండ్లు.. గుండె ఆరోగ్యానికి మేలు..

Protein Source Fruits: వెజిటేరియన్ ప్రోటీన్స్ పుష్కలంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి అంటే అవకాడో, బ్లాక్బెర్రీ, జామపండు వంటి పండ్లలో ప్రోటీన్‌ పుష్కలంగా ఉంటుంది.. అంతే కాదు ఇందులో ఫైబర్, విటమిన్స్, ఖనిజాలు కూడా ఉండటం వల్ల ఇది మంచిది.  ప్రోటీన్ ఉండే కొన్ని రకాల పండ్లను స్మూతీస్ రూపంలో తీసుకుంటే వర్కౌట్ తర్వాత తీసుకుంటే మేలు. 

అవకాడో..
అవకాడో లో కూడా ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులతో పాటు మోనో అన్‌శాచ్యురేటెడ్ కొవ్వులు ఉండటం వల్ల గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో ఫైబర్ కూడా తగిన మోతాదులో ఉంటుంది.. విటమిన్ ఇ, కే, విటమిన్ బి కూడా ఉండటం వల్ల ఎంతో ఆరోగ్యకరం. వీటిని టోస్ట్ లో పెట్టుకొని తినాలి. లేకపోతే నేరుగా అవకాడను కూడా తీసుకోవచ్చు. వీటిని సలాడ్ రూపంలో కూడా తినవచ్చు.

జామ పండు..
జామ పండులో కూడా ప్రోటీన్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. కొన్ని నివేదికల ప్రకారం జామ పండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.. అంతేకాదు ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉంటుంది. ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది .అంతేకాదు ఆరోగ్యకరమైన చర్మానికి కూడా జామ పండు మేలు చేస్తుంది. జీర్ణ ఆరోగ్యానికి జామ చేసే మేలు అంతా ఇంతా కాదు. వీటిని చాలా రూపంలో నేరుగా కూడా తినవచ్చు.

కివి..
కివి పండులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు ఇందులో విటమిన్ సి కూడా ఎక్కువ మోతాదులో ఉంటుంది. పోస్ట్‌ వర్కౌట్‌లో వీటిని తీసుకోవాలి. ఎందుకంటే ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఎక్కువ సేపు ఆకలి కాదు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తాయి, ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

ఆరెంజ్..
ఆరెంజ్ పండ్లలో కూడా విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. వీటిని ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తాయి.. చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఆరెంజ్‌లో ముఖ్యంగా డైటరీ ఫైబర్ ఉంటుంది. జీర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఆరంజ్ తరచూ తీసుకోవడం వల్ల మలబద్ధక సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. వీటిని జ్యూస్‌ రూపంలో తీసుకోవచ్చు.

ఇదీ చదవండి : ఏఐ టెక్నాలజీతో ఇందిరమ్మ ఇళ్లు.. ప్రభుత్వం కీలక ఆదేశాలు..  

అరటి పండ్లు..
అరటి పండ్లు కూడా ప్రోటీన్ ఉంటుంది. ఇందులో పొటాషియం, విటమిన్ సి, బి6, ఫైబర్ ఉంటుంది.. గుండె ఆరోగ్యానికి వేలు చేస్తుంది. మన శరీరానికి శక్తిని అందిస్తాయి. అరటిపండును నేరుగా తినవచ్చు లేదా స్మూథీ రూపంలో తీసుకోవడం వల్ల శరీర ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

చెర్రీ పండ్లు..
చెర్రీ పండ్లలో కూడా ప్రోటీన్లు ఉంటాయి. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఏ, ఫైబర్ ఉంటుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేయటమే కాకుండా నిద్రలేమి సమస్యకు చెక్‌ పెడుతుంది. తాజా చెర్రీ పండ్లను తీసుకోవచ్చు. లేదా వీటిని కుక్ చేసి తీసుకోవచ్చు కొంతమంది సలాడ్ రూపంలో కూడా చెర్రీ పండ్లను తింటారు..

ఇదీ చదవండి : హైదరాబాద్‌వాసులకు అలెర్ట్‌.. ఫిబ్రవరి 1వ తేదీ నీటి సరఫరా బంద్‌..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News