Guava Leaves For Weight Loss And Diabetes: జామపండ్లు ఏ కాలంలోనే సులభంగా లభిస్తున్నాయి. వీటిని ప్రతి రోజు తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అయితే జామ పండ్లే కాకుండా శరీరానికి జామ ఆకులు కూడా ఎంతో ప్రభావంతంగా సహాయపడతాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఈ ఆకుల్లో ఉండే ఆయుర్వేద గుణాలు పొట్ట సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగించడమే కాకుండా అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ప్రతి రోజు జామ ఆకులను తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఖాళీ కడుపుతో జామ ఆకులను తినడం వల్ల కలిగే లాభాలు:
జీర్ణక్రియ మెరుగుపరుచుతుంది:
ఉదయాన్నే ఖాళీ కడుపుతో జామ ఆకులను నమలడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు అజీర్ణం, మలబద్ధకం, గ్యాస్, ఎసిడిటీ వంటి పొట్ట సమస్యలు నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా జామలో ఉండే గుణాలు పొట్టను క్లీన్‌గా ఉంచేందుకు కూడా సహాయపడుతుంది.
శరీర బరువును తగ్గిస్తుంది:
ఉదయాన్నే ఖాళీ కడుపుతో జామ ఆకులతో తయారు చేసిన మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా కార్బోహైడ్రేట్ల శోషణను నిరోధించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు ఈ జామ ఆకులను తీసుకోవాల్సి ఉంటుంది.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
జామ ఆకుల్లో విటమిన్ సి అధిక మోతాదులో లభిస్తుంది..కాబట్టి రోగనిరోధక సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు జామ ఆకులను తీసుకోవడం వల్ల సులభంగా మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తాయి.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
మధుమేహాన్ని నియంత్రిస్తాయి:
జామ ఆకుల్లో ఉండే ఫినాలిక్ మూలకాలు మధుమేహాన్ని నియంత్రించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు రక్తంలోని చక్కెర పరిమాణాలను సులభంగా తగ్గిస్తాయి.
బీపీ నియంత్రణలో ఉంటుంది:
జామ ఆకులను రోజూ ఖాళీ కడుపుతో తినడం వల్ల బీపీ అదుపులో ఉంటుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే పొటాషియం, ఫైబర్ బీపీ నియంత్రించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి