White Hair Treatment: మారుతున్న కాలాలు, ఆహారపు అలవాట్ల కారణంగా జుట్టుపై ప్రభావం పడుతుంది. దీంతో జుట్టు బలహీనంగా మారడం సహా చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్యను చాలా మంది ఎదుర్కొంటున్నారు. అయితే ఈ రోజుల్లో చాలా మంది జుట్టుకు రంగును వేసుకుంటున్నారు. దీని వల్ల అనేక సైడ్ ఎఫెక్ట్స్ గురయ్యే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే నేచురల్ గా జుట్టు నల్లగా మారాలంటే ఈ ఇంటి చిట్కాలను పాటించండి.
1. తులసి
హెయిర్ కేర్ నిపుణులు సలహా ప్రకారం.. తులసి ఆకులలో యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటుంది. దీని ప్రభావం వల్ల తెల్ల జుట్టును నల్లగా మారేందుకు సహయం చేస్తుంది. అయితే జుట్టుకు తులసి ఆకులు ఎలా ఉపయోగపడుతుందో చూడండి.
ముందుగా తులసి ఆకులను తీసుకోని.. జామ కాయ లేదా దాని ఆకుల రసాన్ని తీసుకోవాలి. ఆ తర్వాత భృంగరాజ్ (ఫాల్స్ డైసీ) ఆకుల రసాన్ని సమాన పరిమాణంలో తీసుకొని.. మూడింటిని మిక్స్ చేయాలి. ఆ తర్వాత జుట్టుకు మిశ్రమాన్ని బాగా పట్టించి.. కొద్దిసేపటి తర్వాత తలస్నానం చేయాలి. అలా చేయడం వల్ల తెల్ల జుట్టు నల్లగా మారుతుంది.
2. కరివేపాకు
కరివేపాకులో బయో-యాక్టివ్ పదార్థాలు ఉంటాయి. ఇవి జుట్టుకు పూర్తి పోషణను అందిస్తాయి. కరివేపాకు వల్ల చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్యను దూరం చేస్తుంది. కరివేపాకు పేస్ట్ లేదా కరివేపాకు వేసిన నూనెను తలకు రాసుకోవడం వల్ల తెల్ల జుట్టు నుంచి ఉపశమనం పొందవచ్చు.
3. నిమ్మకాయ
నిమ్మకాయలో ఉండే మూలకాలు జుట్టును నల్లగా మార్చడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఆయుర్వేదం ప్రకారం.. 15 ml నిమ్మరసం, 20 గ్రాముల జామకాయ పొడిని తీసుకోవాలి. ఆ రెండింటిని కలిపి పేస్ట్ లా చేసి తలకు పట్టించాలి. గంట తర్వాత తలస్నానం చేయాలి. అలా కొద్ది రోజులు చేయడం వల్ల తెల్ల జుట్టు నల్లగా మారే అవకాశం ఉంది.
(నోట్: ఈ సమాచారమంతా కొన్ని చిట్కాల నుంచి గ్రహించబడినది. దీన్ని పాటించే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించడం మేలు. దీన్ని Zee తెలుగు News ధ్రువీకరించడం లేదు.)
Also Read: Mosquito Prevention: దోమలు ఇంట్లోకి రాకుండా ఉండేందుకు ఈ టెక్నిక్ పాటించండి!
Also Read: Bad Food Combinations: కీర దోసకాయతో పాటు ఈ కూరగాయలు అసలు తినొద్దు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook