Omicron Variant: దేశంలో ఒమిక్రాన్ కలకలం..ఢిల్లీ ఆస్ప‌త్రిలో 12 మంది అనుమానితులు..!

Delhi: ఢిల్లీలోని లోక్‌నాయ‌క్ జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ్ ఆస్పత్రిలో ఇప్పటివరకు 12 మంది ఒమిక్రాన్ అనుమానితులు చేరినట్లు అధికారులు వెల్లడించారు. గురువారం ఎనిమిది మంది చేరగా.. శుక్రవారం మరో నలుగురు చేరినట్లు సమాచారం.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 3, 2021, 04:28 PM IST
Omicron Variant: దేశంలో ఒమిక్రాన్ కలకలం..ఢిల్లీ ఆస్ప‌త్రిలో 12 మంది అనుమానితులు..!

12 Omicron suspects admitted to Delhi hospital: మనదేశంలో కరోనా కొత్త వేరియంట్ 'ఒమ్రికాన్' కలకలం రేపుతోంది. ఇప్పటికే బెంగళూరులో రెండు ఒమిక్రాన్ కేసులు(Omicron Cases) నిర్ధారణ కాగా...ఇప్పుడు ఢిల్లీలోని లోక్‌నాయ‌క్ జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ్ (LNGP) ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క‌రోనా బాధితుల్లో 12 మందికి ఒమిక్రాన్ వేరియంట్(Omicron Variant) సోకిన‌ట్లు అనుమానిస్తున్నారు. 

Also Read: Travel History లేని బెంగళూరు వైద్యుడికి ఒమిక్రాన్‌.. భయాందోళనలో భారత్! ఇంతకీ ఎలా సోకింది?

విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. ఢిల్లీ(Delhi)లోని ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రి(Lok Nayak Jai Prakash Narayan hospital)లో 12 మంది ఒమిక్రాన్‌ అనుమానిత బాధితులు(Omicron suspects) చేరారు. వీరిలో 8 మంది నిన్ననే ఆస్పత్రికి రాగా.. మరో నలుగురు ఇవాళ చేరారు. నేడు వచ్చిన వారిలో ఇద్దరికి కొవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. మిగిలిన వారి పరీక్షల ఫలితాలు రావాల్సి ఉంది. వీరిలో యూకే నుంచి ఇద్దరు,  ఫ్రాన్స్‌ నుంచి ఒకరు, నెదర్లాండ్స్‌ నుంచి మరొకరు వచ్చినట్లు తెలుస్తోంది. బాధితుల శాంపిల్స్‌ను ఒమిక్రాన్ నిర్ధార‌ణ కోసం జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించిన‌ట్లు సమాచారం.

మెుదటగా బీ.1.1.529 వేరియంట్ దక్షిణాఫ్రికా(South Africa) దేశంలో వెలుగుచూసింది. నవంబరు 26న దీనికి 'ఒమిక్రాన్' గా  నామకరణం చేశారు. ఇప్పటివరకు 23 దేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదైనట్లు డబ్ల్యూహెచ్​ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ తెలిపారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News