Encounter In Kashmir: జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్, కుల్గాం జిల్లాల్లో జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ (జెఇఎం)కి (Jaish-e-Mohammed) చెందిన ఆరుగురు ఉగ్రవాదులు (terrorists) హతమయ్యారు. మరణించిన వారిలో నలుగురు ఉగ్రవాదులను ఇప్పటివరకు గుర్తించినట్లు సమాచారం. ఈ మేరకు కశ్మీర్‌లోని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ట్విటర్లో వెల్లడించింది.
''రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో నిషేధిత ఉగ్రవాద సంస్థ జెఇఎమ్‌కి చెందిన 6 ఉగ్రవాదులు హతమయ్యారు. మరణించిన ఉగ్రవాదుల్లో ఇద్దరు పాకిస్తాన్ కు చెందిన వారు కాగా..మరో ఇద్దరు స్థానిక ఉగ్రవాదులు. మరో ఇద్దరు ముష్కరులు ఎవరనేది భద్రతా బలగాలు పరిశీలిస్తున్నాయి. మాకు ఇది పెద్ద విజయం'' అని కశ్మీర్ జోన్ పోలీసులు ట్వీట్ చేశారు.
6 #terrorists of proscribed #terror outfit JeM killed in two separate #encounters. 4 among the killed terrorists have been identified so far as (2) #Pakistani & (2) local terrorists. Identification of other 02 terrorists is being ascertained. A big #success for us: IGP Kashmir
— Kashmir Zone Police (@KashmirPolice) December 29, 2021
Also Read: Good News: పెట్రోల్ పై రూ. 25 తగ్గించిన రాష్ట్రం.. జనవరి 26 నుండి అమల్లోకి..
బుధవారం కుల్గాం జిల్లాలోని మిర్హామా ప్రాంతంలో (Mirhama area) ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భద్రతా దళాలు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ( cordon and search operation) ప్రారంభించాయి. భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. అనంతనాగ్ జిల్లాలోని నౌగామ్ షాహ్‌బాద్ ప్రాంతంలో (Nowgam Shahabad area) కూడా ఉగ్రవాదులు పోలీసుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతమవగా.. ఓ అధికారి గాయపడ్డారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి