7th Pay Commission DA Hike Details: కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు త్వరలోనే గుడ్ న్యూస్ రానుంది. మరోసారి ఉద్యోగుల ఖాతాలోకి భారీగా నగదు జమకానుంది. 18 నెలలుగా నిలిచిపోయిన ప్రభుత్వ ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్‌పై ఈసారి చర్చలు జరగాల్సి ఉండగా.. క్యాబినెట్ సెక్రటరీతో చర్చలకు ఇప్పటికే ముహుర్తం కూడా ఫిక్స్ అయింది. ఉద్యోగులు, పెన్షనర్లు ఈసారి ప్రభుత్వంపై భారీ ఆశలు పెట్టుకున్నారు.
కేంద్ర ఉద్యోగులు తమ 18 నెలల డీఏ బకాయిల నిత్యం డిమాండ్ చేస్తున్నారు. అయితే దీనిపై ప్రభుత్వం ఎటూ తేల్చట్లేదు. ప్రభుత్వం ఇందుకు అంగీకరించి 7వ వేతన సంఘం కింద కేంద్ర ఉద్యోగులు డీఏ బకాయిలు చెల్లిస్తే ఉద్యోగుల ఖాతాలో భారీగా డబ్బులు పడనున్నాయి. అందుకే ఉద్యోగులు డీఏ పెండింగ్ అమౌంట్ కోసం పోరాడుతున్నారు.
ఉద్యోగుల డిమాండ్‌కు కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తే ఎవరి ఖాతాలో ఎంత నగదు జమ కానుందో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ జేసీఎం (స్టాఫ్ సైడ్) శివ గోపాల్ మిశ్రా వివరాలు వెల్లడించారు. వేర్వేరు ఉద్యోగులకు వేర్వేరు బకాయిలు ఉన్నాయన్నారు. లెవల్-1 ఉద్యోగుల డీఏ బకాయిలు రూ.11,880 నుంచి రూ.37,554 వరకు ఉండగా.. లెవల్-13 (7వ సీపీసీ బేసిక్ పే-స్కేల్) రూ.1,23,100 నుంచి రూ.2,15,900 లేదా లెవల్-14 (పే-స్కేల్) ఉద్యోగి ఖాతాలో డీఏ బకాయిలు రూ.1,44,200 నుంచి రూ.2,18,200 వరకు చెల్లిస్తారని తెలిపారు.
కరోనా కాలం తరువాత జూలై 1, 2020 నుంచి కేంద్ర ప్రభుత్వం డియర్‌నెస్ అలవెన్స్‌ను పూర్తిగా 11 శాతం పెంచింది. అయితే ఆ సమయంలో ఉద్యోగులకు ఇంకా డీఏ చెల్లించలేదు. 18 నెలలకు సంబంధించిన డీఏ పెండింగ్‌లో ఉండిపోయింది. ఈ విషయంపై గతేడాది ఆర్థిక మంత్రిత్వ శాఖ ఫ్రీజ్ అయిన డీఏపై బదులుగా బకాయిలు చెల్లించబోమని స్పష్టం చేసింది. అయితే ఉద్యోగా సంఘాల నుంచి వరుసగా డిమాండ్లు వస్తుండడంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. ప్రస్తుతం కేంద్ర ఉద్యోగుల డీఏ 34 శాతం నుంచి 38 శాతానికి పెరిగింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం దృష్ట్యా పెండింగ్ డీఏలపై కేంద్ర ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని పెన్షనర్లు, ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
Alsr Read: Ind Vs NZ: టీమిండియాదే సిరీస్.. చివరి టీ20 మ్యాచ్ టై
Alsr Read: Shraddha Murder Case: అఫ్తాబ్ ఇంట్లో రక్తపు మరకలు.. అక్కడి నుంచి 18 ఎముకలు స్వాధీనం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి