Aadhaar-voter card link: ఎన్నికల ప్రక్రియలో మరింత పారదర్శకతను పెంచేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఎన్నికల కమిషన్‌కు మరిన్ని అధికారాలు ఇచ్చేలా కొత్త చట్టం (Bill on Aadhaar-voter ID linking) తీసుకురానుంది. ఇందుకు సంబంధించిన బిల్లు నేడు పార్లమెంట్ ముందుకు రానున్నట్లు సమాచారం.
ఆధార్‌తో ఓటరు కార్డు అనుసంధానం (Aadhaar link vith Voter card) చేసేందుకు వీలు కల్పించే బిల్లును లోక్ సభలో సోమవారం ప్రవేశపెట్టనుంది కేంద్రం.
కొత్త చట్టం ఎందుకు?
నకిలీ ఓట్ల సమస్యను పరిష్కరించేందుకు కొత్త చట్టాన్ని తీసుకురానుంది కేంద్రం. దీనితో పాటు ఎన్నికల ప్రక్రియకు సంబంధించి.. ఎన్నికల సంఘానికి (Election Commission of India) మరిన్ని అధికారాలు కట్టబెట్టనుంది.
ఈ కొత్త చట్టం అమలులోకి వస్తే.. కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునే వారి నుంచి గుర్తింపు ధృవీకరణ కోసం ఆధార్‌ను కోరనుంది ఎన్నికల కమిషన్. దీనితో పాటు ఇప్పటికే ఓటు హక్కు ఉన్న వారి నుంచి కూడా ఆధార్ సేకరించేందుకు వీలుపడనుంది. అయితే వ్యక్తిగత గోప్యతను దృష్టిలో ఉంచుకుని.. ఆధార్-ఓటర్ ఐడీ లింక్ తప్పనిసరి ప్రాతిపదికన కాకుండా.. ఐచ్చికంగానే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ బిల్లు పార్లమెంట్లో (Election Law Amendment Bill 2021) ప్రవేశ పెడితే ఆ వివరాలు బహిర్గతం కానున్నాయి.
ఓటు హక్కు నమోదుకు కార్యక్రమం ఏడాదికి 4 సార్లు..
అర్హులందరికి ఓటు హక్కు కల్పించే ఉద్దేశంతో మరో కీలక అంశం కూడా ఈ బిల్లులో చేర్చింది కేంద్రం. దీని ప్రకారం.. ఏడాదికి నాలుగు సార్లు ఓటు హక్కు నమోదు చేసుకునే వీలు కలగనుంది. ప్రస్తుతం ఏడాదికి ఒకసారి మాత్రమే ఈ అవకాశం లభిస్తోంది. ఈ బిల్లు చట్ట రూపం దాల్చితే 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు నమోదు కోసం ఏడాదికి నాలుగు అవకాశాలు లభించనున్నాయి.
Also read: Video: పెళ్లి కొడుకును చితకబాదిన వధువు కుటుంబం-తీరా పెళ్లి సమయానికి ఆ డిమాండ్ చేయడంతో
Also read: IRCTC update: మహిళల రక్షణకు రైల్వే కీలక నిర్ణయం- ఆ ట్రైన్లలో బెర్త్‌లు రిజర్వ్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook