Agnipath protests: దేశంలో అగ్నిపథ్ ఆందోళనలు మరింతగా విస్తరించాయి. ఆర్మీ ఆభ్యర్థుల ఆందోళనతో దేశం అట్టుడికిపోతోంది. అగ్నిపథ్ కు వ్యతిరేకంగా రోడ్డెక్కుతున్న నిరుద్యోగ అభ్యర్థులు హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఏకంగా కాల్పులు జరిపే వరకు పరిస్థితి వెళ్లింది. దాదాపు ఐదు గంటల పాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నిరసనకారులు విధ్వంసం స్పష్టించారు. మూడు రైళ్లకు నిప్పు పెట్టారు. పోలీసులు జరిగిన కాల్పుల్లో ఓ నిరసనకారుడు చనిపోయాడు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు కాల్పులకు దిగినా నిరసనకారులు ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇంకా పట్టాలపైనే కూర్చుని నిరసన తెలుపుతున్నారు.
అగ్నిపథ్ ఆందోళనలతో దేశం అట్టుడుకుతున్నా కేంద్ర సర్కార్ మాత్రం దిగిరావడం లేదు. అగ్నిపథ్ కు మద్దతుగానే మాట్లాడుతున్నారు. ఆర్మీ రిక్రూట్ మెంట్ కోసం కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్.. నిరుద్యోగ యువతకు గోల్డెన్ అవకాశమని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. అగ్నిపథ్ విషయంలో వెనక్కితగ్గే ఆలోచనే లేదన్నారు. దేశంలని యువత అగ్నిపథ్ ఉద్యోగాల కోసం సిద్ధం కావాలని రాజ్ నాథ్ సింగ్ సూచించారు. గత రెండేళ్లుగా ఆర్మీలో నియామకాలు చేపట్టనందున.. కొత్త వారికి అవకాశం దక్కలేదన్నారు రాజ్ నాథ్ సింగ్. వాళ్ల కోసమే ప్రభుత్వం అగ్నివీరుల నియామకానికి వయో పరిమితి 21 నుంచి 23 ఏళ్లకు పెంచిందని చెప్పారు. కేంద్ర సర్కార్ తాజా నిర్ణయంతో లక్షలాది మంది యువతకు అగ్నిపథ్ అర్హత లభిస్తుందన్నారు. అగ్నిపథ్ స్కీం తీసుకొచ్చినందుకు ప్రధాని మోడీకి రాజ్ నాథ్ సింగ్ కృతజ్ఞతలు తెలిపారు.
#WATCH | For the last 2yrs, young people didn't get the opportunity to get inducted into Armed forces due to no recruitment process. Thus... govt decided to increase the upper age limit from 21yrs to 23yrs. It's a one-time relaxation...: Defence Minister Rajnath Singh#Agnipath pic.twitter.com/UfP5z0zakY
— ANI (@ANI) June 17, 2022
దేశంలోని యువకుల ప్రయోజనం కోసమే అగ్నిపథ్ స్కీం తీసుకొచ్చామని, వయో పరిమితి పెంచామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. దేశం కోసం సేవ చేయాలనే యువకులకు ఇది సువర్ణ అవకాశం అన్నారు. యువశక్తి సాధికారత కోసమే మోడీ సర్కార్ ఆ నిర్ణయం తీసుకుందని అమిత్ షా తెలిపారు. కేంద్ర రోడ్లు, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కూడా అగ్నిపథ్ మంచి పథకమని చెప్పారు. నిరుద్యోగులకు ప్రయోజనం కలగనుంది.. కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా ప్రతిపక్షాలకు వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు. నిరుద్యోగులు ఆందోళన చేయకుండా అగ్నిపథ్ లో భాగంగా అగ్నివీరులుగా మారడానికి సమాయత్తం కావాలని నితిన్ గడ్కరీ సూచించారు.
Read also: Agnipath Protest: దేశంలో అగ్నిపథ్ జ్వాలలు..చేయి దాటిపోతున్న పరిస్థితి..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.