Agnipath Protests: 'అగ్నిపథ్' నిరసనల ముసుగులో చోరీ.. రైల్వే టికెట్ కౌంటర్ నుంచి రూ.3 లక్షలు ఎత్తుకెళ్లారు..

Bihar Agnipath Protests: 'అగ్నిపథ్' నిరసనల ముసుగులో బీహార్‌లో భారీ చోరీ జరిగింది. రైల్వే టికెట్ కౌంటర్‌పై దాడి చేసిన నిరసనకారులు రూ.3 లక్షలు ఎత్తుకెళ్లారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 18, 2022, 01:50 PM IST
  • దేశవ్యాప్తంగా అగ్నిపథ్ నిరసనలు
  • బీహార్‌లో రైల్వే టికెట్ కౌంటర్‌లో భారీ చోరీ
  • నిరసనల ముసుగులో రూ.3 లక్షలు ఎత్తుకెళ్లిన అల్లరి మూక
Agnipath Protests: 'అగ్నిపథ్' నిరసనల ముసుగులో చోరీ.. రైల్వే టికెట్ కౌంటర్ నుంచి రూ.3 లక్షలు ఎత్తుకెళ్లారు..

Bihar Agnipath Protests: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో అగ్నిపథ్ నిరసనలు హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా బీహార్, తెలంగాణల్లో చోటు చేసుకున్న నిరసనల్లో తీవ్ర హింస చెలరేగింది. బీహార్‌లోని ఓ రైల్వే స్టేషన్‌లో చోరీ కూడా జరిగింది. అరాహ్ ప్రాంతంలో బిహియా రైల్వే స్టేషన్ టికెట్ కౌంటర్‌లోని రూ.3 లక్షలు చోరీ అయ్యాయి. నిరసనల ముసుగులో కొంతమంది మూక ఈ చోరీకి పాల్పడినట్లు టికెట్ కౌంటర్ ఇన్‌ఛార్జి తెలిపారు.

ప్యాసింజర్లకు టికెట్లు ఇస్తున్న సమయంలో గుంపుగా అక్కడికి వచ్చిన నిరసనకారులు దాడికి పాల్పడినట్లు చెప్పారు. అనంతరం టికెట్ కౌంటర్ కార్యాలాయానికి నిప్పంటించి.. కౌంటర్‌లో ఉన్న రూ.3 లక్షలు ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. దీనిపై రైల్వే అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

త్రివిధ దళాల్లో నియమాకాలకు కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ను వ్యతిరేకిస్తూ బీహార్‌లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ఆందోళనల్లో భాగంగా నిరసనకారులు రైల్వే స్టేషన్లను ముట్టడిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే పలు రైళ్లకు నిప్పంటించారు. బీహార్ డిప్యూటీ సీఎం రేణు దేవితో పాటు బీహార్ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ సంజయ్ జైస్వాల్ ఇళ్లపై కూడా దాడులు చేశారు.

అగ్నిపథ్ నిరసనలు మొదట బీహార్‌లో హింసాత్మకంగా మారగా.. ఆ తర్వాత తెలంగాణ, హర్యానా, యూపీ రాష్ట్రాలకు కూడా అది విస్తరించింది. తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో శుక్రవారం (జూన్ 17) ఉదయం నిరసనకారులు విధ్వంసానికి పాల్పడ్డారు. రైళ్లకు నిప్పంటించి, షాపులపై దాడులు చేశారు. పార్శిల్ లగేజీలను తగలబెట్టారు. ఈ క్రమంలో పోలీసులు కాల్పులు జరపగా కాల్పుల్లో ఒకరు మృతి చెందారు. నిరసనకారుల విధ్వంసంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో రూ.20 కోట్లు మేర ఆస్తి నష్టం జరిగినట్లు రైల్వే అధికారులు అంచనా వేశారు.  

Also Read: Agnipath Riots: అగ్నిపథ్‌ అల్లర్ల మాస్టర్ మైండ్ ఏపీలో అరెస్ట్?

Also Read: Virata Parvam 1st Day Collections: సాయి పల్లవి-రానా 'విరాటపర్వం' ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా...  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News