రిసార్ట్ నుంచి సొంతగూటికి ఎమ్మెల్యేలు.. కాంగ్రెస్‌లో జోష్

రిసార్టుకు వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆదివారం (మార్చి 15) రాష్ట్రానికి తిరిగొచ్చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాజధాని భోపాల్ ఎయిర్ పోర్టుకు చేరుకుని విజయ సంకేతాలిచ్చారు.

Last Updated : Mar 16, 2020, 06:33 AM IST
రిసార్ట్ నుంచి సొంతగూటికి ఎమ్మెల్యేలు.. కాంగ్రెస్‌లో జోష్

భోపాల్: మధ్యప్రదేశ్ రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. రాజస్థాన్‌లోని జైపూర్‌ రిసార్టుకు వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆదివారం (మార్చి 15) రాష్ట్రానికి తిరిగొచ్చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాజధాని భోపాల్ ఎయిర్ పోర్టుకు చేరుకుని విజయ సంకేతాలిచ్చారు. విశ్వాసపరీక్షలో కాంగ్రెస్ విజయం సాధించి తీరుతుందని ఈ ఎమ్మెల్యేలు ధీమా వ్యక్తం చేశారు. మార్చి 16న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్ బల పరీక్షను ఎదుర్కోనుంది. సోమవారం విశ్వాసపరీక్ష ఉందని గవర్నర్ లాల్జీ టాండన్ శనివారం ప్రకటించిన నేపథ్యంలో జైపూర్ రిసార్టులో ఉన్న కాంగ్రెస్, స్వతంత్ర్య ఎమ్మెల్యేలు భోపాల్‌కు తిరిగొచ్చేశారు.

కమల్ నాథ్ సర్కార్‌కి కష్టమొస్తే.. మధ్య ప్రదేశ్ సీఎం రేసులో ఉందెవరు?

కాంగ్రెస్ సీనియర్ నేత హరీష్ రావత్ మీడియాతో మాట్లాడారు. విశ్వాస పరీక్షలో సీఎం కమల్ నాథ్ కచ్చితంగా విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. రెబెల్ ఎమ్మెల్యేలతో కూడా పార్టీ కీలకనేతలు టచ్‌లో ఉన్నారని షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. మాపై ఎలాంటి ఒత్తిడి లేదని, విశ్వాస పరీక్షను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. 

ఆర్టికల్ 174, 175(2) ప్రకారం మధ్యప్రదేశ్ అసెంబ్లీ సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. విశ్వాసపరీక్ష నిర్వహించడమే తరువాయి అని గవర్నర్ లాల్జీ టాండన్ తన లేఖలో పేర్కొన్నారు. బెంగళూరు ఇతరుల ఆధీనంలో ఉన్న 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సురక్షితంగా మధ్యప్రదేశ్‌కు తీసుకురావాలని, అసెంబ్లీలో విశ్వాసపరీక్షలో తమ ఓటు హక్కు వినియోగించుకునేలా కేంద్ర హోంమంత్రి చర్యలు తీసుకోవాలని కోరుతూ అమిత్ షాకు సీఎం కమల్ నాథ్ నాలుగు పేజీల లేఖ రాసిన విషయం తెలిసిందే.

కాగా, రాజీనామా చేసిన 22 మంది ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదం పొందితే సీన్ మరోలా ఉంటుంది. రాజీనామాలు ఆమోదం పొందితే కమల్ నాథ్ సర్కార్ సంఖ్యాబలం తగ్గడంతో పాటు అదే సమయంలో సభలో బీజేపీ సభ్యుల సంఖ్యాబలం పెరుగుతుంది. కానీ కమల్ నాథ్ సర్కార్ తిరుగుబాటు ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదించకపోగా, వారిని ఎలాగైనా మళ్లీ తమవైపు తిప్పుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. 

See Photos: అందమైన భామలు.. లేత మెరుపు తీగలు

మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయిందని, బలపరీక్ష నిర్వహించాలని మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ శనివారం గవర్నర్‌ టాండన్‌ను కోరిన విషయం తెలిసిందే. మైనార్టీలో ఉన్న కమల్ నాథ్ సర్కార్‌కు విధానపరమైన నిర్ణయాలు తీసుకునే అధికారం లేదని  గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. కీలకనేత జ్యోతిరాదిత్య సింధియాతో పాటు మరికొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు తమ పదవికి రాజీనామా చేయడంతో కమల్ నాథ్ సర్కారుకు కష్టాలు మొదలయ్యాయి. అనంతరం జ్యోతిరాదిత్య సింధియా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. 

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News