Bihar: తొలిదశ పోలింగ్ రేపే, ఉదయం 7 గంటల్నించే ప్రారంభం

దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న బీహార్ ఎన్నికల సమరం మరి కాస్సేపట్లో ప్రారంభం కానుంది. తొలిదశ పోలింగ్ రేపు అంటే అక్టోబర్ 28న జరగనుంది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ ఏర్పాట్లు పూర్తయ్యాయి.

Last Updated : Oct 27, 2020, 11:33 PM IST
Bihar: తొలిదశ పోలింగ్ రేపే, ఉదయం 7 గంటల్నించే ప్రారంభం

దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న బీహార్ ఎన్నికల సమరం ( Bihar Elections ) మరి కాస్సేపట్లో ప్రారంభం కానుంది. తొలిదశ పోలింగ్ ( First phase poling ) రేపు అంటే అక్టోబర్ 28న జరగనుంది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ ఏర్పాట్లు పూర్తయ్యాయి.

కరోనా వైరస్ ( Corona virus ) సంక్రమణ నేపధ్యంలో దేశంలో జరుగుతున్న తొలి ఎన్నికలివి. బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు మూడు దశల్లో ( Bihar Elections in 3 phases ) జరగనున్నాయి. ఇందులో భాగంగా తొలి దశ పోలింగ్ రేపు అంటే అక్టోబర్ 28న జరగనుంది. దీనికోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్డీయే తరపున ముఖ్యమంత్రి అభ్యర్ధిగా నితీష్ కుమార్ ( Nitish kumar ) మరోసారి బరిలో ఉండగా..మహా ఘట్బంధన్ తరపున తేజస్వీ యాదవ్ ( Tejaswi yadav ) సీఎం అభ్యర్ధిగా పోటీలో ఉన్నారు. 

మొత్తం 243 అసెంబ్లీ సీట్లున్న బీహార్ అసెంబ్లీకు మూడు దశల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. తొలిదశ పోలింగ్ 71 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 28న, రెండోదశ పోలింగ్ నవంబర్ 3వ తేదీన, మూడోదశ పోలింగ్ నవంబర్ 7 వతేదీన జరగనుంది. నవంబర్ 10 వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.

రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన ఎన్నికల సంఘం  భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ప్రచారం సందర్భంగా ప్రధాన రాజకీయ పార్టీల మధ్య విమర్శనాస్త్రాలు తీవ్రమయ్యాయి. ఇరు పక్షాల తరపున భారీగా ప్రచారం సాగింది. ఓటర్లను ఆకట్టుకునేందుకు హామీల వర్షమే కురిసింది. Also read: PM Modi: నగదు బదిలీ ద్వారా 170 వేలు ఆదా చేయగలిగాం

Trending News