Portable Marriage Hall: ఇటీవల కాలంలో క్రియేటివిటి పెరిగిపోతోంది. తాము చేసే పనుల్లో కొత్త దనం చూపిస్తున్నారు యువతి యువకులు. కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారు. సమాజానికి ఉపయోగపడే కొత్త కొత్త ఆవిష్కరణలు రోజురోజుకు వెలుగులోనికి వస్తున్నాయి. అలాంటి కోవలోనే ఓ వ్యక్తి రూపొందించిన సరికొత్త ఆవిష్కరణ అందరిని ఆకర్శిస్తొంది. అతను అందుబాటులోకి తీసుకువచ్చిని మొబైల్ మ్యారేజ్ హాల్ అందరిని కట్టిపడేస్తోంది. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా కూడా కొత్త ఆవిష్కరణకు ఫిదా అయ్యారు.
ట్రక్కును ఉపయోగించి ఎంతో అద్భుతంగా, ఆకర్షణీయంగా కదిలే కల్యాణ మండపాన్ని రూపొందించాడు యువకుడు. ఈ కదిలే బంకెట్ హాల్ ఉన్న కంటైనర్ వాహనాన్ని ఎక్కడికైనాఈజీగా తీసుకునిపోవచ్చు.పెళ్లిళ్లు, ఫంక్షన్లు జరుపుకోవచ్చు.40×30 చదరపు అడుగుల్లో ఉన్న ఈ కదిలే కళ్యాణ మండపంలో 200 మందికి సేవలు అందిచవచ్చు. కంటైనర్ లోపల కూలింగ్ కోసం రెండు ఏసీలు అమర్చారు. ఒక చిన్నపాటి మ్యారేజీ ఫంక్షన్ హాల్ లో ఉండాల్సిన అన్ని సదుపాయాలు ఈ కదిలే బంకెట్ హాల్ లో ఉన్నాయి. లోపల అందమైన ఫర్నీచర్ అమర్చారు. ఇంటీరియర్స్ వర్క్ కూడా చూడటానికి సూపర్ గా ఉంది. పూర్తి ఎకో ఫ్రెండ్లీగా ఈ కదిలే కల్యాణ మండపాన్ని రూపొందించారు.
I’d like to meet the person behind the conception and design of this product. So creative. And thoughtful. Not only provides a facility to remote areas but also is eco-friendly since it doesn’t take up permanent space in a population-dense country pic.twitter.com/dyqWaUR810
— anand mahindra (@anandmahindra) September 25, 2022
కదిలే కల్యాణ మండపం వీడియోను ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ట్విటర్లో షేర్ చేశారు. దీన్ని రూపొందించిన వ్యక్తి క్రియేటివిటీని ఆయన అభినందించారు. అద్భుతమైన ఆవిష్కరణ చేసిన వ్యక్తిని కలువాలనుకుంటున్నట్లు ట్వీట్ లో తెలిపారు ఆనంద్ మహీంద్రా. పల్లెటూళ్లలో ఇలాంటివి బాగా ఉపయోగపడుతాయని అభిప్రాయపడ్డారు. ఇది పర్యావరణానికి పూర్తి అనుకూలమని కొనియాడారు. ఆనంద్ మహీంద్ర షేర్ చేసిన ఈ వీడియో వైరల్ గా మారింది. నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
Also read: Telangana Politics: రేవంత్ రెడ్డికి షాకిచ్చేలా రాజకీయాలు.. తెలంగాణలో ఆ రెండు పార్టీలు కలిసిపోతాయా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook