Voter ID Card: ఓటరు ఐడీ కార్డు కావాలన్నా లేక అందులో ఏమైనా మార్పులు చేసుకోవాలన్నా ఏ మాత్రం ఇబ్బంది లేకుండా ఇంట్లోంచే ఉచితంగా ఆన్‌లైన్ విధానంలో చేసుకోవచ్చు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రతి ఒక్కరి విధి. ఓటు వేయడం కూడా అందరి బాధ్యత. మీరు మొదటిసారిగా ఓటేస్తుండి, ఓటర్ ఐడీ కార్డు లేకపోతే వెంటనే అప్లై చేసుకోవచ్చు.
వాస్తవానికి ఓటరు జాబితాలో పేరుండి ఓటర్ ఐడీ కార్డు లేకపోయినా ఫరవాలేదు. ఏదో ఒక ప్రభుత్వ గుర్తింపు కార్డు చూపించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. కానీ ఓటర్ ఐడీ కార్డే ఉంటే ఇక ఎలాంటి ఇబ్బంది ఉండదు. భవిష్యత్తులో చాలా రకాల పనులకు ఐడీ అండ్ అడ్రస్ ప్రూఫ్‌గా పనిచేస్తుంది. అందుకే ఓటర్ ఐడీ అనేది తప్పనిసరి. దేశంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొందుతారు. ఓటర్ ఐడీ అనేది భారత పౌరసత్వానికి రుజువు కూడా.
ఓటర్ ఐడీ కోసం ఎలా అప్లై చేయాలి
ఆన్‌లైన్‌లో ఓటర్ ఐడీ కోసం అప్లై చేయాలంటే ముందుగా ఎన్నికల కమీషన్ అధికారిక వెబ్‌సైట్ https://voters.eci.gov.in.ఓపెన్ చేయాలి. ఇప్పుడు మీ ఐడీ క్రియేట్ చేసి ఫోన్ నెంబర్ , ఓటీటీ సహాయంతో లాగిన్ అవాలి.ఇప్పుడు Register as New Voter – Form 6 క్లిక్ చేయాలి. సంబంధిత సమాచారం, ఫోటో, ఇతర వివరాలు ఎంటర్ చేయాలి. అడ్రస్ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డు అప్‌లోడ్ చేయాలి. చివరిగా మీరు సమర్పించిన సమాచారం సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. తరువాత సబ్మిట్ చేయాలి. మీకొక అప్లికేషన్ ఐడీ వస్తుంది. దాని ఆధారంగా స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.
దరఖాస్తు చేసిన వారం రోజుల తరువాత సంబంధిత వెబ్‌సైట్‌లో అప్లికేషన్ స్టేటస్‌ను మీ అప్లికేషన్ ఐడీ ఆదారంగా చెక్ చేసుకోవచ్చు. కార్డు సిద్ధమైతే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అదే సమయంలో కొద్దిరోజుల్లో మీ చిరునామాకు కార్డు అందుతుంది. అదే వెబ్‌సైట్‌లో ఓటర్ ఐడీ కార్డు ఇప్పటికే ఉంటే అందులో కరెక్షన్ ఆప్షన్ అంటే మార్పులకు అవకాశం ఉంటుంది.
Also read: Parle G: పార్లే జి బిస్కట్ కంపెనీ కధ తెలుసా, ఓ టైలర్ ప్రారంభించిన కంపెనీ అది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook