Renu Desai Fired: అడ్డగోలు వ్యాఖ్యలతో ఇటీవల వార్తల్లో కెక్కిన యూట్యూబర్ రణవీర్ అల్లాబాడియా. ఇండియాస్ గాట్ లాటెంట్ షోలో చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే లేపాయి. వ్యూస్, పాపులారిటీ కోసం అడ్డగోలు వ్యాఖ్యలు చేసిన రణవీర్‌పై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. క్షమాపణలు చెప్పినా వెనక్కి తగ్గడం లేదు. తాజాగా పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇండియాస్ గాట్ లాటెంట్ కార్యక్రమంలో ఓ యూట్యూబర్ రణవీర్ అల్లాబాడియా దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. అది కూడా ఓ మహిళా కంటెస్టెంట్‌ని అడగకూడని ప్రశ్న అడిగి అభాసుపాలయ్యాడు. మీ తల్లిదండ్రులు సెక్స్ చేయడం జీవితాంతం చూస్తావా లేక ఒకసారి కలిసి దాన్ని శాశ్వతంగా ఆపేస్తా అని అడగడంతో అంతా షాకయ్యారు. అందుకే నెటిజన్లంతా తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు సైతం రణవీర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతని యూట్యూబ్ ఛానెల్ బ్యాన్ చేయాలని కోరుతున్నారు. అడ్డదారిలో పాపులారిటీ కోసం, రాత్రికి రాత్రి పేరు తెచ్చుకునేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంటారు.
తాజాగా రేణు దేశాయ్ ఈ అంశంపై స్పందించారు. రణవీర్ అల్లాబాడియాపై తీవ్రంగా విరుచుకుపడింది. మీ పిల్లల్ని మంచిగా పెంచాలనుకుంటే రణవీర్ లాంటి ఇడియట్స్‌కు దూరం పెట్టండి అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఇలాంటి వెధవల్ని అన్ ఫాలో చేయండి. యంగ్ జనరేషన్ ఎంతో బాధ్యతగా ఉండాలి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ముసుగులో వల్గారిటీని సహించకూడదు అని పోస్ట్ చేసింది. రేణు దేశాయ్ పోస్ట్ సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. అందరూ రేణుకు సపోర్ట్‌గా కామెంట్లు చేస్తున్నారు.
Also read: Delhi CM Candidate: ఢిల్లీ ముఖ్యమంత్రిని ఖరారు చేసిన బీజేపీ అధిష్టానం, మాజీ జర్నలిస్టుకే అవకాశం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి