Note for Vote case: ఓటుకు నోటు కేసులో మరో కీలక పరిణామం చేసుకుంది. చంద్రబాబు నాయుడిని ముద్దాయిగా చేర్చాలనే పిటీషన్ పై విచారణ మొదలైంది. దీనిపై కోర్టు నిర్ణయం ఎలా ఉందంటే..
దేశవ్యాప్తంగా సంచలనం కల్గించిన ఓటుకు నోటు కేసు ( Note for vote case ) లో సుప్రీంకోర్టు ( Supreme court )లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అటు హైదరాబాద్ ఏసీబీ కోర్టు ( Acb court ) లో కూడా ఈ కేసులో విచారణ ఇటీవలే ప్రారంభమైంది. ఈ కేసులో చంద్రబాబు నాయుడిని ముద్దాయిగా చేర్చాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటీషన్ పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే ( supreme court chief justice bobde ) నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటీషనర్ తరపున న్యాయస్థానంలో ప్రశాంత్ భూషణ్ వాదనలు విన్పించారు. ఈ అంశంపై కచ్చితమైన విచారణ తేదీని ప్రకటించాలని కోరగా..లిఖితపూర్వక ఆదేశాల్లో స్పష్టం చేస్తామన్నారు.
ఈ కేసులో వాదన విన్పించిన ప్రశాంత్ భూషణ్..ఓటుకు నోటు కేసు ఛార్జిషీటులో చంద్రబాబు ( Chandrababu naidu ) పేరు ఏకంగా 37 సార్లు ప్రస్తావించినా సరే..ముద్దాయిగా చేర్చలేదని పిటీషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పేరు చేర్చి..సీబీఐ ( CBI ) దర్యాప్తు చేయించాలన్నారు. రాజకీయంగా ముడిపడిన కేసుల్ని త్వరగా విచారించాలన్న సుప్రీంకోర్టు తీర్పును ఈ సందర్బంగా ఉదహరించారు. చంద్రబాబు పేరును కేసులో చేర్చే విషయమై వేసవి సెలవుల అనంతరం విచారణ చేపడతామని సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ బాబ్డే తెలిపారు. Also read: GST: టీ బడ్డీ యజమాని కాదు..షాపింగ్ మాల్ యజమాని అట