Foreign Liquor: మద్యం ప్రియులకు జాక్‌పాట్‌.. ఒకే దుకాణం మూడు బ్రాండ్ల మద్యం

At One Shop Three Brands Will Available In Wine Shops: మందుబాబులకు భారీ శుభవార్త. దేశీ మద్యంతోపాటు విదేశీ మద్యం కూడా అందుబాటులో లభించనుంది. అన్ని రకాల మద్యం ఒకే దుకాణంలో అందుబాటులోకి రానుంది. ఎక్కడ? ఏమిటో ఆ వివరాలు తెలుసుకుందాం.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 6, 2025, 05:47 PM IST
Foreign Liquor: మద్యం ప్రియులకు జాక్‌పాట్‌.. ఒకే దుకాణం మూడు బ్రాండ్ల మద్యం

Foreign Liquor At Local: దేశీయంగా ఎన్ని రకాల మద్యం లభించినా విదేశీ మద్యానికి ఉన్న కిక్కే వేరప్పా! విదేశీ మద్యం తాగితే కిక్కుతోపాటు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుండడంతో మందుబాబులు ఫారెన్‌ లిక్కర్‌ తాగాలని తాపత్రయ పడుతున్నారు. కాకపోతే ఆ మద్యానికి భారీ ధర ఉండడంతో అందరూ ఆ మద్యాన్ని సేవించలేరు. దీనికి తోడు స్థానికంగా అందుబాటులో ఉండదు. ఇన్నీ ఇబ్బందుల మధ్య విదేశీ మద్యం తాగడం కష్టం. కానీ ఇకపై మందుబాబులకు అలాంటి పరిస్థితి ఉండదు. స్థానికంగానే విదేశీ మద్యం అందుబాటులోకి రానుంది. మద్యంప్రియులకు ప్రభుత్వం భారీ శుభవార్త వినిపించింది. ఒకే దుకాణంలో బీర్‌, దేశీయ మద్యంతోపాటు ఫారన్‌ లిక్కర్‌ను విక్రయించనున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: KA Paul: 'ట్రంప్‌ భారతదేశ పౌరులను తరిమేస్తుంటే.. ప్రధాని మోదీ ఏం చేస్తున్నారు?

దేశీయంగా అందుబాటులో ఉన్న మద్యం, బీర్లతోపాటు ఫారెన్‌ లిక్కర్‌ను కూడా ఒకే దుకాణంలో పెట్టి విక్రయించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం కొత్త విధానం తీసుకొచ్చింది. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం కొత్త మద్యం విధానం అమల్లోకి తీసుకురాగా.. వాటిలో భారీ మార్పులు జరిగాయి. యూపీ ఎక్సైజ్‌ విధానంలో జరిగిన అనేక మార్పులతో మద్యం ప్రియులకు భారీ ప్రయోజనం చేకూరుతోంది. విదేశీ మద్యం కూడా స్థానికంగా విక్రయించడంతోపాటు వైన్‌ షాపులకు లైసెన్స్‌ లాటరీ విధానంలో అందిస్తున్నారు. విదేశీ మద్యం చిన్న చిన్న బుడ్డీల్లో విక్రయించడం కొత్త మద్యం విధానంలో వచ్చిన కీలక మార్పు.

Also Read: Upasana Konidela: పవన్ కల్యాణ్ కోడలు సంచలన నిర్ణయం.. పిఠాపురం నుంచే 'ఆ పనికి' శ్రీకారం

యూపీ ప్రభుత్వం 2025-26 మద్యం విధానానికి ఆమోద ముద్ర వేసింది. కాంపోజిట్‌ దుకాణాల పేరిట లైసెన్స్‌లు జారీ చేసి ఆ దుకాణాల్లో విదేశీ మద్యం, బీర్‌, మన దేశీయ మద్యం విక్రయించే అవకాశం ఉంటుంది. అయితే దుకాణాల వద్ద మాత్రం కూర్చుని తాగే అవకాశం నిషేధం విధించడం గమనార్హం. కాగా కొత్తగా తీసుకువచ్చిన మద్యం విధానం ద్వారా ఏడాదికి రూ.55 వేల కోట్ల ఆదాయాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

యూపీ మద్యం విధానంలో ముఖ్యాంశాలు

  • రెండు కంటే ఎక్కువ లైసెన్సులు పొందరాదు. వ్యక్తి, సంస్థ, కంపెనీ ఎవరైనా కూడా రెండింటికి మాత్రమే అనుమతి ఉంటుంది.
  • మాల్స్‌లోని మల్టిప్లెక్స్‌లలో ప్రీమియం బ్రాండ్‌ దుకాణాలు తెరవడానికి అనుమతి నిరాకరణ.
  • విమానాశ్రయాలు, మెట్రో, రైల్వే స్టేషన్‌లలో ప్రీమియం రిటైల్‌ దుకాణాలకు అనుమతి.
  • తొలిసారిగా 60, 90 ఎంఎల్‌ విదేశీ మద్యం సీసాలు విక్రయానికి అందుబాటులో ఉంచనున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News