Bank of India Offer: అద్బుత ప్రయోజనాలతో బ్యాంక్ ఆఫ్ ఇండియా శాలరీ అక్కౌంట్ వివరాలివే

Bank of India Offer: ప్రభుత్వ, ప్రైవేటు రంగ ఉద్యోగుల కోసం బ్యాంక్ ఆఫ్ ఇండియా అద్బుతమైన ఆఫర్ ప్రకటించింది. అదే శాలరీ ప్లస్ అకౌంట్ స్కీమ్. ఈ స్కీమ్‌లో అకౌంట్ ఓపెన్ చేస్తే..కోటి రూపాయల వరకూ ప్రయోజనాలున్నాయి. అవేంటో తెలుసుకోండి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 14, 2021, 09:12 PM IST
  • అద్భుతమైన ఆఫర్లతో శాలరీ ప్లస్ అకౌంట్ స్కీమ్ ప్రారంభించిన బ్యాంక్ ఆఫ్ ఇండియా
  • ప్రభుత్వ, ప్రైవేటు రంగ ఉద్యోగులకు స్కీమ్ అవకాశం
  • శాలరీ అకౌంట్‌తో పాటు కోటి రూపాయల మేర ప్రయోజనాలు
 Bank of India Offer: అద్బుత ప్రయోజనాలతో బ్యాంక్ ఆఫ్ ఇండియా శాలరీ అక్కౌంట్ వివరాలివే

Bank of India Offer: ప్రభుత్వ, ప్రైవేటు రంగ ఉద్యోగుల కోసం బ్యాంక్ ఆఫ్ ఇండియా అద్బుతమైన ఆఫర్ ప్రకటించింది. అదే శాలరీ ప్లస్ అకౌంట్ స్కీమ్. ఈ స్కీమ్‌లో అకౌంట్ ఓపెన్ చేస్తే..కోటి రూపాయల వరకూ ప్రయోజనాలున్నాయి. అవేంటో తెలుసుకోండి.

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ బ్యాంక్ ఆఫ్ ఇండియా(Bank of India)ఇప్పుడు అద్భుత ఆఫర్ ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేటు రంగ ఉద్యోగుల కోసం శాలరీ ప్లస్ అకౌంట్ స్కీమ్ ప్రారంభించింది. ఈ స్కీమ్‌లో చేరిన ఉద్యోగులు ఏకంగా కోటి రూపాయల వరకూ ప్రయోజనాలు పొందవచ్చు. బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. ఆ వివరాలిలా ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా శాలరీ ప్లస్ అకౌంట్ స్కీమ్‌లో(Salary plus Account Scheme) భాగంగా మూడు రకాల వేతన ఖాతాలున్నాయి. ఉద్యోగులు కేవలం శాలరీ అకౌంట్ కింద మాత్రమే ఖాతా తెరవవచ్చు.

పారా మిలిటరీ ఫోర్స్ ఉద్యోగులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, యూనివర్శిటీ, కళాశాల, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు శాలరీ అకౌంట్(Salary Account) ఉంటుంది. ప్రైవేట్ రంగ ఉద్యోగులకు కూడా శాలరీ అకౌంట్ కల్పిస్తారు. ఈ స్కీమ్‌లో కోటి రూపాయల వరకూ ఉచిత యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అందుతుంది. అంతేకాకుండా 30 లక్షల వరకూ పర్సనల్ డెత్ ఇన్సూరెన్స్ లభిస్తుంది. వేతన ఖాతాదారుడికి కోటి రూపాయలు ఉచిత ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఉంటుంది. మరో అద్భుత ఆఫర్..2 లక్షల వరకూ ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం ఉంటుంది. ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం ప్రకారం బ్యాంకు ఖాతాలో బ్యాలెన్స్ లేకపోయినా 2 లక్షల వరకూ విత్‌డ్రా చేసుకోవచ్చు. అంతేకాకుండా ఉచితంగా గోల్డ్ ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డు (Free Credit Card)అందిస్తుంది. ఏడాదికి 100 లీవ్స్  కలిగిన చెక్ బుక్ ఉచితంగా ఇస్తుంది. డీమ్యాట్ అకౌంట్‌పై ఎఎంసి ఛార్జ్ ఉండదు. రుణాల విషయంలో ఖాతాదారులకు 0.25 బేసిస్ పాయింట్లను తగ్గిస్తుంది.నెలకు పదివేల రూపాయలు సంపాదించే ప్రైవేట్ ఉద్యోగి కూడా ఈ ఖాతా తెరవవచ్చు. మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేదు. 5 లక్షల వరకూ పర్సనల్ యాక్సిడెంటల్ డెత్ ఇన్సూరెన్స్ లభిస్తుంది. 

Also read; Post Office Deposit Schemes: పోస్టాఫీసు డిపాజిట్ పథకాల్లో కనక వర్షం కురిపించే ఐదు పథకాలివే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News