సుప్రీంకోర్టు తీర్పుతో ( Supreme court judgement ) బీహార్ పోలీసుల వైఖరి, ఎఫ్ ఐ ఆర్ సరైన చర్యగా నిర్ధారణైందని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్పష్టం చేశారు. సుశాంత్ సింహ్ రాజ్ పుత్ కేసును సీబీఐకు అప్పగించడంపై ఆయన స్పందించారు. అయితే ఈ విషయంపై రాజకీయంగా వ్యాఖ్యలు చేయనన్నారు.
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింహ్ రాజ్ పుత్ ( Bollywood actor sushant singh rajput ) మరణ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. ఓ దశలో ముంబై-పాట్నా పోలీసుల ( Mumbai-patna police ) మద్య వైరాన్ని సైతం తెచ్చిపెట్టింది. పాట్నాపోలీసులు తనపై నమోదు చేసిన కేసును మంబైకు బదిలీ చేయాలంటూ సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి ( Rhea chakraborty ) సుప్రీంకోర్టులో ( Supreme court ) దాఖలు చేసిన పిటీషన్ పై కోర్టు తీర్పు వెలువడింది. ఈ కేసు విచారణను సీబీఐకు ( CBI probe ) అప్పగిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. అంతేకాకుండా సీబీఐ దర్యాప్తు ముంబై పోలీసులు సహకరించాలని కోరింది. అయితే ఇదే కేసును బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ విజ్ఞప్తి మేరకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సీబీఐకు అప్పగించింది.
It was duty of Bihar Police to probe after complaint, but they didn't get cooperation in Mumbai. Behaviour meted out to our IPS officer is known to all. With SC verdict, it's clear what happened wasn't right. Any political comment in this situation isn't right: Bihar CM to ANI https://t.co/vwwlKofJkZ
— ANI (@ANI) August 19, 2020
ఈ కేసులో బీహార్ పోలీసుల ( Bihar police ) వైఖరి గానీ ఎఫ్ ఐ ఆర్ ( FIR ) నమోదు గానీ సరైన చర్యగా సుప్రీం తీర్పుతో స్పష్టమైందని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ( Bihar cm nitish kumar ) వెల్లడించారు. ఇది ఒక్క సుశాంత్ కుటుంబం కోసమే కాదని..మొత్తం దేశం ఆసక్తి చూపిస్తోందన్నారు. సీబీఐ దర్యాప్తుతో ఈ కేసులో న్యాయం జరుగుతుందని ప్రజలు భావిస్తున్నట్టు నితీష్ తెలిపారు. ఫిర్యాదు వచ్చిన తరువాత స్పందించడం బీహార్ పోలీసుల విధి అని..అయితే ముంబై పోలీసులు సహకరించలేదన్నారు. జరిగింది సరైంది కాదని సుప్రీంకోర్టు తీర్పుతో తేటతెల్లమైందన్నారు. ఈ సమయంలో రాజకీయంగా దీనిపై వ్యాఖ్యలు చేయదల్చుకోలేదన్నారు నితీష్ కుమార్. Also read: Delhi Rains: కూలిన గోడ చేసిన విధ్వంసం అంతా ఇంతా కాదుగా...