One Nation One Election: జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు పార్లమెంట్‌లో వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు పెట్టేందుకు కేంద్రం సిద్దమైంది. నరేంద్ర మోడీ 2014లో అధికారంలోకి వచ్చనప్పటి నుంచి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని మాట్లాడుతూనే ఉన్నారు. సుధీర్ఘ రాజకీయ ప్రక్రియ కాబట్టి వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఆలస్యమవుతూ వచ్చింది. అయితే... మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలి నాలుగు ఎన్నికలు అసెంబ్లీ,లోక్ సభకు జరిగాయి. ఒక ఎన్నికలు తర్వాత మరో ఎన్నికలు వస్తే.. అభివృద్దిపై దృష్టి కేంద్రీకరించక పోవడం.. ప్రజలకు ఉపయోగా పడాల్సిన దేశ వనరులు ఎలక్షన్ నిర్వహణ కోసమే ఖర్చు అవుతోంది. అంతేకాదు కేంద్ర బలగాలను ప్రతిసారి ఎన్నికలు జరిగే ప్రాంతానికి తరలించడం వంటివి జరగుతున్నాయి. దేశ సరిహద్దులు, నక్సలైట్స్ , ఉగ్రవాదుల పని పట్టాల్సిన భద్రతా దళాలు ఎన్నికల నిర్వహణలో భాగం కావడం దేశానికి నష్టం చేకూర్చే అంశాలని చెప్పాలి.
ఒకేసారి ఎన్నికలు జరిగితే.. దేశ వనరులు ఆదా కావడంతో పాటు అందులో మిగిలే డబ్బును ప్రజా సంక్షేమం కోసం ఖర్చు పెట్టొచ్చనే ఉద్దేశ్యంతో ఒకే దేశం ఒకే ఎన్నిక వైపు కేంద్ర మొగ్గు చూపుతోంది. తొలి నాలుగు ఎన్నికలు జమిలి ఎన్నికలు దేశం చూసిన సందర్భాలున్నాయి. ఈ నేపథ్యంలో గతేడాది సెప్టెంబర్ లో మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవంద్ అధ్యక్షతన ఏర్పడిన జమిలి ఎన్నికల కమిటీకి ఇప్పటికే కేంద్రం ఆమోదించిన సంగతి తెలిసిందే కదా. నిన్న కేంద్ర క్యాబినేట్ తాజాగా ఈ బిల్లుకు ఆమోదం తెలపడం విశేషం.
ఈ నేపథ్యంలోనే BJP తమ MPలకు విప్ జారీచేసింది. బిల్లు పార్లమెంట్ ముందుకు రానున్న నేపథ్యంలో సభ్యులందరూ హాజరుకావాలని కోరింది. దీంతో జమిలిని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీ కూడా తమ సభ్యులందరూ పార్లమెంట్‌కు రావాలంటూ విఫ్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో అతి త్వరలో పార్లమెంట్ ముందుకు జమిలీ ఎన్నికల బిల్లు రాబోతుందన్న అంశం స్ఫస్టమయ్యింది. మరోవైపు కేంద్రం శుక్ర, శనివారాలు భారత రాజ్యాంగంపై పార్లమెంట్ ఉభయ సభల్లో చర్చించనున్న సంగతి తెలిసిందే కదా. అయితే.. జమిలి ఎన్నికల బిల్లు సోమవారం ప్రవేశ పెట్టే అవకాశాలున్నాయి. రాజ్యాంగ సవరణ బిల్లు అయిన జమిలి ఎన్నికల బిల్లును పార్లమెంట్ ఆమోదం పొందాలంటే ఉభయ సభల్లో మూడింత రెండొంతలు ఆమోదం పొందాలి. అందులో ఉన్న కొన్ని సాధారణ బిల్లులకు సాధారణ మెజారిటీ ఉంటే సరిపోతుంది.
ఇదీ చదవండి: ఫామ్ హౌస్ రౌడీ.. ఆది నుంచి మోహన్ బాబు తీరు వివాదాస్పదం..
ఇదీ చదవండి: Nagababu Cabinet: ముగ్గురు మొనగాళ్లు.. దేశంలోనే మొదటిసారి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.