Subramanian Swamy: బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి నిత్యం తన శైలితో వార్తల్లో నిలుస్తుంటారు. దేశంలో ఏ అంశం బయటకు వచ్చినా తనదైన శైలిలో సెటైర్లు వేస్తుంటారు. తాజాగా సొంత పార్టీ నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కాశ్మీర్ లోయలో జరుగుతున్న వరుస హత్యలపై స్పందించారు. ఈక్రమంలోనే కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. షాకు క్రీడా శాఖ అయితే బాగుంటుందంటూ సెటైర్లు వేశారు.
జమ్మూకాశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన అమల్లో ఉందని..అక్కడ నిత్యం హత్యలు జరుగుతున్నాయన్నారు. ఈ పరిస్థితుల్లో నైతిక బాధ్యత వహిస్తూ అమిత్ షా రాజీనామా చేయాలని చెప్పారు. ఆయనకు క్రీడల శాఖ ఇస్తే బాగుంటుందని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈమధ్య కాలంలో క్రికెట్‌కు అనవసర ఆదరణ పెరిగిదంటూ ఫైర్ అయ్యారు. ఈమేరకు ట్విట్ చేశారు. సుబ్రహ్మణ్య స్వామిపై రాజకీయంగా తీవ్ర దుమారం రేగుతోంది.
సొంతపార్టీ నేతలే మోదీ పాలనపై విమర్శలు చేస్తున్నారని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఐతే ఇటీవల అమిత్ షానే టార్గెట్‌గా సుబ్రహ్మణ్య స్వామి విమర్శలు సంధిస్తున్నారు. ఇటీవల జరిగిన టీ20 టోర్నీపై తనదైన శైలిలో విమర్శలు చేశారు. ఈమ్యాచ్‌లో రిగ్గింగ్ జరిగినట్లు నిఘా సంస్థల్లో అనుమానాలున్నాయన్నారు. వీటిపై లోతైన విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో కోర్టులో పిల్ వేయాలనుకుంటున్నా అంటూ స్పందించారు.
Also read:Revanth reddy in America: డల్లాస్‌లో సందడిగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
Also read:Kashmir Killings: కాశ్మీర్ లోయలో 'హైబ్రీడ్' ఉగ్రవాదం..పోలీసుల విచారణలో కీలక విషయాలు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook