Subramanian Swamy: బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి నిత్యం తన శైలితో వార్తల్లో నిలుస్తుంటారు. దేశంలో ఏ అంశం బయటకు వచ్చినా తనదైన శైలిలో సెటైర్లు వేస్తుంటారు. తాజాగా సొంత పార్టీ నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
Subramanian Swamy: ప్రతి విషయంలో విఫలమయ్యారంటూ.. ప్రధాని మోదీపై బీజేపీ నేత సుబ్రమణియన్ స్వామి మరోసారి విమర్శలు చేశారు. ఆర్థికం నుంచి అంతర్గత భద్రత వరకు అన్ని విషయాల్లో మోదీ ఫెయిల్ అంటూ ట్వీట్ చేశారు.
స్వలింగ సంపర్కంపై బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి తనదైన శైలిలో స్పందించారు. మంగళవారం ఆయన ట్వీట్టర్ వేదికగా స్పందిస్తూ స్వలింగ సంపర్కం సహజమైన ప్రక్రియకు విరుద్ధమైన చర్య అని పేర్కొన్నారు. హోమో సెక్సువల్స్ ప్రభావం నుంచి జనాలు బయటపడేందుకు మెడికల్ రీసర్చ్ ద్వారా మార్గాలు వెతకాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. హోమో సెక్సువల్స్ చూసి ఆనందించడం కానీ.. వారికి మద్దతు పలకడం కానీ నీచమైన చర్యన్న స్వామి ..అలాంటి వారికి శిక్షించాల్సిన అవసరముందని పేర్కొన్నారు.
సుబ్రమణ్యస్వామి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందుత్వమే బీజేపీకి బలమని.. అభివృద్ధి నినాదం కన్నా..హిందుత్వమే నినాదమే ఎన్నికల్లో పార్టీని గెలిపిస్తుందని స్వామి అభిప్రాయపడ్డారు. గతంలో ' భారత్ వెలిగిపోతోంది' నినాదంతో ఎన్నికల బరిలోకి దిగి బీజేపీ ఓటమి పాలైందని..2014 ఎన్నికల్లో హిందుత్వ నినాదం పార్టీని గెలిపించిందన్న విషయాన్ని గుర్తు చేస్తూ స్వామి తన వాదనను సమర్ధించుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణ నుంచి టీటీడీని విముక్తి కలిగించడమే లక్ష్యంగా సాగుతున్న బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి తన పోరాటాన్ని మరింత ముమ్మరం చేస్తున్నారు. దీని కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ నెల 19న పిటిషన్ వేస్తానని సుబ్రమణ్యస్వామి పేర్కొన్నారు.
కాశ్మీరీలకు స్వాత్రంత్ర్యం ప్రసాదించి.. వారు స్వతంత్రంగా బతకేలా చూడాలని గతంలో అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు ముషారఫ్ చేసిన మాటలను సమర్థించిన సీనియర్ కాంగ్రెస్ నేత సయిఫుద్దీన్ సోజ్ పై బీజేపీ, శివసేన నేతలు మండిపడ్డారు.
తిరుమల తిరుపతి దేవస్ధానం పాలకమండలి(టీటీడీ బోర్డు)లో అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి పదవి కోల్పోయిన ఆ ఆలయ ప్రధానార్చకులు రమణ దీక్షితులు ఉదంతం కొత్త మలుపులు తిరుగుతోంది.
గత ఏడాది కాలంగా తమిళనాడులోని సామాజిక, రాజకీయ పరిణామాలపై కమల్ హాసన్ ఎప్పటికప్పుడు తన ట్విటర్ ఖాతా ద్వారా ప్రస్తావిస్తూ ఆ రాష్ట్ర మంత్రులు, అధికార పార్టీ నేతలు, ఇతర రాజకీయ నాయకులని ఎండగడుతూ వస్తున్నారు.
రజినీకాంత్ ఓ నిరక్షరాస్యుడు అని సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యన్ స్వామి. అంతటితో ఆగని బీజేపీ అగ్రనేత మరిన్ని ఆరోపణలతో రజినీకాంత్పై విమర్శల దాడి మొదలుపెట్టారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.