దేశంలో తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. దేశవ్యాప్తంగా మొత్తం 9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం చేపట్టారు. తెలంగాణ గవర్నర్ గా జిష్షుదేవ్ వర్మ నియమితులయ్యారు. ఏయే రాష్ట్రాలకు ఎవరెవరనేది జాబితా ఇలా ఉంది
తెలంగాణ జిష్టు దేవ్ వర్మ
రాజస్థాన్ హరిభౌ కిషన్ రావు బాగ్డే
సిక్కిం ఓం ప్రకాశ్ మాధుర్
జార్ఘండ్ సంతోష్ కుమార్ గంగ్వార్
మేఘాలయ సీహెచ్ విజయ శంకర్
మహారాష్ట్ర సీపీ రాధాకృష్ణన్
పంజాబ్ గులాబ్ చంద్ కటారియా
అస్సోం లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య
ఛత్తీస్ గడ్ రామెన్ డేక
వీరిలో తెలంగాణ కొత్త గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ త్రిపుర ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు గవర్నర్ గా నియమితులయ్యారు. మహారాష్ట్ర గవర్నర్ గా నియమితులైన సీపీ రాధాకృష్ణన్ ప్రస్తుతం జార్ఘండ్ గవర్నర్ గా, తెలంగాణకు ఇన్ ఛార్జిగా ఉన్నారు. అదే విధంగా పంజాబ్ కొత్త గవర్నర్ గులాబ్ చంద్ కటారియా ప్రస్తుతం అస్సోం గవర్నర్ గా ఉన్నారు. ఇక అస్సోం కొత్త గవర్నర్ లక్ష్మీ ప్రసాద్ ఆచార్య సిక్కిం గవ్నర్ గా ఉన్నారు.
Also read: Free Train: పైసా ఖర్చు లేని రైలు ప్రయాణం, అది కూడా అందమైన లొకేషన్లలో ఎక్కడో తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook