Third Party Insurance Premium Hike: కారు కొనడానికి మీరు ప్లాన్ చేస్తున్నారా ? అయితే ఈ వార్త తప్పకుండా మీ కోసమే. అవును.. ఎందుకంటే దేశవ్యాప్తంగా జూన్ 1 తర్వాత కార్ల ధరలు భారీగా పెరగనున్నాయి. దీనికి కారణం జూన్ 1 నుండి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియం ధరలు భారీగా పెరగడమే. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందనే విషయాన్ని జీ మీడియాకు చెందిన జీ బిజినెస్ న్యూస్ ముందుగానే పసిగట్టింది. జీ బిజినెస్ ముందుగా వెల్లడించినట్టుగానే తాజాగా దీనికి సంబంధించి ఇన్సూరెన్స్ అండ్ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు బదులుగా రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ పరిధిలోని రవాణా విభాగం ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది.
150 సీసీ కంటే అధిక కెపాసిటీ కలిగిన బైకులకు ఇన్సూరెన్స్ ప్రీమియం 15 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. అలాగే 1000 సీసీ నుండి 1500 సీసీ కెపాసిటీ ఉండే వాహనాలకు 6 శాతం థర్డ్ పార్టీ ప్రీమియం చార్జీలు పెరగనున్నాయి.
కొత్తగా కారు కొనుగోలు చేసే వారు మూడు సంవత్సరాలు గడువు కలిగిన ఇన్సూరెన్స్ తీసుకున్నట్టయితే.. అందుకోసం 23 శాతం వరకు అధిక మొత్తంలో ప్రీమియం చెల్లించుకోక తప్పదు. అలాగే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కోసం మరో 11 శాతం అదనపు ప్రీమియం చెల్లించుకోవాల్సిందే. 1000 సీసీ నుండి 1500 సీసీ కెపాసిటీ కలిగిన కార్లకు ఇది వర్తిస్తుంది.
ఇక ద్విచక్ర వాహానాల థర్డ్ పార్టీ ప్రీమియం 17 శాతం వరకు అదనం కానుంది. వాణిజ్య అవసరాలకు వినియోగించే వాహనాల ఇన్సూరెన్స్ ప్రీమియం ధరల్లో అంతగా పెరుగుదల ఉండకపోవచ్చు. సదరు వాహనదారులకు ఇది కొంత ఉపశమనం కలిగించే విషయం. మూడేళ్ల విరామం తర్వాత థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియం ఛార్జీల పెంపుపై కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
Also read : PM Kisan Yojana: త్వరలో పీఎం కిసాన్ 11వ విడత డబ్బులు.. ఈకేవైసీ అప్‌డేట్‌కు ఇంకా 7 రోజులే గడువు
Also read : Edible Oil: కేంద్రం కీలక నిర్ణయం.. వంట నూనెల ధరలు దిగొచ్చే అవకాశం...!
Also read : Petrol Rate: దేశంలో దిగొస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. ఏ ఏ రాష్ట్రాల్లో ఎంతంటే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి