Omicron Variant: ఒమిక్రాన్ వేరియంట్ ముప్పు ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతోంది. అత్యంత వేగంగా సంక్రమిస్తున్న ఒమిక్రాన్ పట్ల పూర్తి అప్రమత్తతతో వ్యవహరించాలంటూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచిస్తోంది.
దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఒమిక్రాన్ వేరియంట్ మొత్తం ప్రపంచంలో ఆందోళన రేపుతోంది. ఇప్పటికే వందకు పైగా దేశాల్లో ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. ప్రతిరోజూ కొత్తగా కేసులు నమోదవుతున్నాయి. ఇటు ఇండియాలో కూడా ఒమిక్రాన్ సంక్రమణ పెరుగుతోంది. ప్రతిరోజూ కొత్త కేసులు ,వివిధ రాష్ట్రాల్లో నమోదవుతున్నాయి. ఈ నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వాల్ని కేంద్ర ప్రభుత్వం(Central government) అప్రమత్తం చేసింది. ఒమిక్రాన్ వేరియంట్‌ను నియంత్రించేందుకు వెంటనే వార్‌రూమ్‌లను ప్రారంభించాలని కోరింది. ఒమిక్రాన్ వేరియంట్‌పై(Omicron Variant) పలు సూచనలు చేసింది.
ఇప్పటికే దేశంంలో అత్యధిక ఒమిక్రాన్ కేసులు(Omicron Variant Cases) మహారాష్ట్రలో ఉన్నాయనే విషయం తెలిసిందే. ఇది చాలదన్నట్టు తాజాగా అదే రాష్ట్రంలో 11 కొత్త ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. అటు తెలంగాణలో కొత్తగా 4 ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. ఫలితంగా ఇప్పటివరకూ దేశంలో నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 215కు పెరిగింది. మహరాష్ట్రలో కొత్తగా నమోదైన 11 ఒమిక్రాన్ కేసుల్లో 8 ముంబైలో ఉండగా మిగిలినవి నవీ ముంబై, పింప్రీ చించ్వాడ్, ఉస్మానాబాద్‌లలో ఉన్నాయి. మహారాష్ట్రలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 65 కాగా, 54 కేసులతో ఢిల్లీ రెండవ స్థానంలో నిలిచింది. ఇక 24 ఒమిక్రాన్ కేసులతో తెలంగాణ(Telangana)మూడవ స్థానంలో ఉంది. అటు కర్ణాటకలో 19, రాజస్థాన్‌లో 18, కేరళలో 15, గుజరాత్‌లో 14 కేసులున్నాయి. దేశంలో ఒమిక్రాన్ సోకిన 215 మందిలో 77 మంది ఇప్పటికే కోలుకున్నారు.
మరోవైపు దేశంలో డెల్టా వేరియంట్(Delta Variant)కేసులు కూడా ఇంకా వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇది అత్యంత ప్రమాదకరం. ఎందుకంటే రెండు రకాల వేరియంట్‌లు వ్యాప్తిలో ఉన్నప్పుడు..ఆ రెండింటి ఫలితంగా సూపర్ స్ట్రెయిన్ ముప్పు పొంచి ఉంటుంది. ఇది ప్రాణాంతకం కావచ్చు. ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం..రాష్ట్రాలకు అప్రమత్తంగా ఉండాలంటూ సూచనలు జారీ చేసింది. డెల్టా వేరియంట్‌తో పోలిస్తే..ఒమిక్రాన్ మూడు రెట్లు ఎక్కువ వేగంతో వ్యాప్తి చెందుతుందని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు దూరదృష్టితో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని కోరింది. వివిధ రాష్ట్రాల్లోని వార్‌రూమ్స్‌ని (War Rooms)వెంటనే యాక్టివేట్ చేయాలని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ తెలిపారు. రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల్లో, జిల్లాల్లో ఎక్కడికక్కడ పరిస్థితులకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని సూచించారు. అవసరమైతే నైట్‌కర్ఫ్యూ విధించడం లేదా ఎక్కువ మంది గుమిగూడకుండా నియంత్రణ చర్యలు చేపట్టడం వంటివి చేయాలన్నారు. ఆసుపత్రులు, అంబులెన్స్‌లు, ఆక్సిజన్ పరికరాలు, ఔషధాలకు సంబంధించి మౌళిక సదుపాయాల్ని ఏర్పాటు చేసుకోవాలన్నారు.
Also read: New Labour Code : వారంలో నాలుగు రోజులే పని... కొత్త ఏడాదిలో సరికొత్త కార్మిక విధానం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook