e Shram Portal: దేశవ్యాప్తంగా కార్మికులకు కేంద్రం శుభవార్త అందించింది. కార్మికుల సంక్షేమం కోసం కొత్త సేవల్ని అందుబాటులో తెచ్చింది. అసంఘటిత రంగం కోసం ప్రారంభించిన ఈ సదుపాయంతో మరింత సౌలభ్యం కలుగుతుంది.
దేశవ్యాప్తంగా అసంఘటిత రంగంలో(Unorganised Sector) కార్మికుల సమస్యలు చాలా ఎక్కువ. ఇటువంటి కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర కార్మిక, ఉపాధిశాఖ గుడ్‌న్యూస్ అందించింది. కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్ ఈ శ్రమ్ పోర్టల్(E Shram Portal) ప్రారంభించారు.ఈ పోర్టల్ ద్వారా అసంఘటిత కార్మికుల వివరాలన్నీ ఓ చోట లభిస్తాయి. తద్వారా ఆ కార్మికుల సంక్షేమం కోసం వివిధ సామాజిక భద్రతా పథకాల్ని మరింత మెరుగ్గా అమలు చేయడానికి వీలవుతుంది. ఆధార్ కార్డు(Aadhaar Card) ద్వారా అసంఘటిత కార్మికులు తమ వివరాల్ని పోర్టల్‌లో నమోదు చేసుకోవల్సి ఉంటుంది.
దేశ చరిత్రలో తొలిసారిగా 38 కోట్లమంది అసంఘటిత కార్మికుల వివరాల నమోదు కోసం ఓ వ్యవస్థ తయారైంది. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ సామాజిక భద్రతా పథకాల్ని పొందేందుకు వీలు కలుగుతుంది. ఈ శ్రమ్‌లో నమోదైన కార్మికులకు 2 లక్షల రూపాయల ప్రమాద బీమా(Accidental Insurance) అందుతుంది. పాక్షిక వైఫల్యం చెందితే లక్ష రూపాయలు, మరణిస్తే 2 లక్షల రూపాయలు అందుతాయి.
Also read: Covid19 Alert: సెప్టెంబర్-అక్టోబర్ నెలల్లో మరింత జాగ్రత్త అవసరం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook