Missing Arunachal Boy found by China PLA: కొద్దిరోజుల క్రితం అదృశ్యమైన అరుణాచల్ ప్రదేశ్‌కి చెందిన మిరామ్ తరోన్(17) ఆచూకీ లభ్యమైంది. అతన్ని తమ భూభాగంలో గుర్తించినట్లు చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఏల్ఏ) భారత సైన్యానికి సమాచారం అందించింది. ప్రోటోకాల్‌ను పాటిస్తూ అతన్ని తిరిగి భారత్‌కు అప్పగిస్తామని తెలిపింది. హాట్ లైన్ కమ్యూనికేషన్ ద్వారా చైనా భారత్‌కు ఈ సమాచారాన్ని చేరవేసింది. తేజ్‌పూర్‌లోని భారత రక్షణ శాఖ పీఆర్వో లెఫ్టినెంట్ కల్నల్ హర్షవర్ధన్ పాండే ఈ వివరాలను వెల్లడించారు.
నిజానికి మిరామ్ తరోన్ (Arunachal Missing Boy) చైనా పీపుల్స్ ఆర్మీ లిబరేషన్ అపహరించినట్లుగా అతని స్నేహితుడు జానీ యయింగ్ అధికారులకు సమాచారమిచ్చిన సంగతి తెలిసిందే. పీఎల్ఏ నుంచి తాను తప్పించుకోగలిగానని.. కానీ మిరామ్ తరోమ్‌ను వారు కిడ్నాప్ చేశారని యయింగ్ వెల్లడించాడు. కానీ చైనా పీఎల్ఏ మాత్రం మిరామ్ తరోమ్‌ను తాము కిడ్నాప్ చేయలేదని చెప్పకనే చెప్పేసింది. తమ భూభాగంలో అతని ఆచూకీని కనుగొన్నామని చెప్పడం ద్వారా కిడ్నాప్ ఆరోపణలను పరోక్షంగా ఖండించినట్లయింది.
అరుణాచల్ ప్రదేశ్‌లోని (Arunachachal Pradesh )జీడో గ్రామానికి చెందిన మిరామ్ తరోన్, జానీ యయింగ్ స్థానిక అటవీ ప్రాంతంలో మూలికలు సేకరించడంతో పాటు జంతువులను వేటాడుతుంటారు. ఇదే క్రమంలో ఐదు రోజుల క్రితం ఇద్దరు కలిసి వేట నిమిత్తం వాస్తవాధీన రేఖ సమీపంలోని సంగ్‌పో నది వద్దకు వెళ్లారు. అక్కడ చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మిరామ్‌ను కిడ్నాప్ చేసిందని.. తాను తప్పించుకుని వచ్చానని జానీ యయింగ్ వెల్లడించాడు. దీనిపై అక్కడి ఎంపీ గావ్ ప్రధాని మోదీని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.
మిరామ్ తరోన్ చైనా పీఎల్ఏ కిడ్నాప్ చేసినట్లు తెలియడంతో అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తమ కుమారుడిని సురక్షితంగా వెనక్కి తీసుకురావాలని ప్రధాని మోదీకి (Narendra Modi), భారత సైన్యానికి విజ్ఞప్తి చేశారు. కుమారుడు కిడ్నాప్ అయ్యాడనే బెంగతో అతని తల్లి తిండి కూడా మానేసింది. దీంతో ఆమె అనారోగ్యానికి గురైంది. ఎట్టకేలకు మిరామ్ ఆచూకీ తెలియడం.. అతన్ని అప్పగిస్తామని చైనా పీఎల్ఏ భారత సైన్యానికి చెప్పడం అతని తల్లిదండ్రులకు కాస్త ఊరటనిచ్చిట్లయింది.
Also Read: Palmistry: అరచేతిలో ఆ గుర్తు ఉంటే.. ఎంత పేదోడిగా పుట్టినా అపర కుబేరుడు అవుతాడట..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook