‘బేబీ మఫ్లర్ మ్యాన్’ను ప్రత్యేకంగా ఆహ్వానించిన ఆప్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల రోజున ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్లో తరహాలో ఉన్న ‘బేబీ మఫ్లర్ మ్యాన్’కు ఆప్ నుంచి ప్రత్యేకంగా ఆహ్వానం అందింది. 16వ తేదీన జరిగే కేజ్రీవాల్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ‘బేబీ మఫ్లర్ మ్యాన్’ను ఆహ్వానించినట్టుగా ఆప్ ట్విట్టర్ లో పేర్కొంది.  

Last Updated : Feb 13, 2020, 07:58 PM IST
‘బేబీ మఫ్లర్ మ్యాన్’ను ప్రత్యేకంగా ఆహ్వానించిన ఆప్

న్యూ ఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల రోజున ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్లో తరహాలో ఉన్న ‘బేబీ మఫ్లర్ మ్యాన్’కు ఆప్ నుంచి ప్రత్యేకంగా ఆహ్వానం అందింది. 16వ తేదీన జరిగే కేజ్రీవాల్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ‘బేబీ మఫ్లర్ మ్యాన్’ను ఆహ్వానించినట్టుగా ఆప్ ట్విట్టర్ లో పేర్కొంది.  

ఫిబ్రవరి 11న, ఆప్ గెలుపు ఉత్సవాల్లో పాల్గొన్న, ఏడాది వయసున్న ఆ బాలుడి పేరు అవ్యాన్ తోమర్, ఓ ఆప్ కార్యకర్త కుమారుడని తెలిపారు. ఢిల్లీ ఎన్నికల కౌంటింగ్ రోజున ఆప్ ప్రధాన కార్యాలయం వద్ద అందరినీ ఆకట్టుకున్నాడు. అరవింద్ కేజ్రీవాల్ కట్టుకునేట్టుగా తలకు మఫ్లర్ చుట్టుకుని, మెరూన్ కలర్ స్వెటర్ వేసుకుని, కేజ్రీవాల్ ధరించేటటువంటి కళ్లద్దాలు పెట్టుకుని, ఆప్ టోపీ, చిన్న మీసంతో అలరించాడు. 

 

ఫలితాల రోజున అవ్యాన్ తోమర్ ప్రపంచ వ్యాప్తంగా ఫొటోలు వైరల్ అయ్యాయి. సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొట్టాయి.  అదే రోజు ‘బేబీ మఫ్లర్ మ్యాన్’ అని పేరు పెట్టారు. తాజాగా ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. 

ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో 62  సీట్లు దక్కించుకుని అధికార పీఠాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ సొంతం చేసుకుంది. కేంద్రంతోపాటు పలు రాష్ట్రాల్లో దూసుకువెళ్తోన్న బీజేపీ. . ఢిల్లీ ఎన్నికల్లో మాత్రం సత్తా చాటలేకపోయింది. మొత్తంగా తుది ఫలితాలు వెలువడే సరికి 8 స్థానాలకు పరిమితమైంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News