Kerala Lockdown: దేశమంతా కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతుంటే..ఆ రాష్ట్రంలో మరోసారి కోవిడ్ వైరస్ విజృంభిస్తోంది. కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో మరోసారి సంపూర్ణ లాక్‌డౌన్ విధించింది ప్రభుత్వం.
కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave) ఉధృతి దేశంలో దాదాపుగా తగ్గుతోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ అన్‌లాక్ ప్రక్రియ నడుస్తోంది. మరోవైపు కరోనా థర్డ్‌వేవ్ ముప్పు పొంచి ఉందనే హెచ్చరికలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో కేరళలో పరిస్థితి ఆందోళన కల్గిస్తోంది.దేశంలో ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో దాదాపు 30 శాతం కేరళ(Kerala)నుంచే వస్తుండటం కలకలం కల్గిస్తోంది. అందుకే రాష్ట్రవ్యాప్తంగా రెండ్రోజుల పాటు అంటే జూలై 17,18 తేదీల్లో సంపూర్ణ లాక్‌డౌన్ విధించింది ప్రభుత్వం.ఈ రెండ్రోజులు కేవలం నిత్యావసర వస్తువులు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి. కరోనా సంక్రమణ ఛైన్‌ను అరికట్టేందుకు రెండ్రోజులు సంపూర్ణ లాక్‌డౌన్ విధిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. కోవిడ్ టెస్ట్ పాజిటివ్ రేటు ఆధారంగా కేరళలోని ప్రాంతాల్ని నాలుగు కేటగరీలుగా విభజించారు. టీపీఆర్ 5 లోపుంటే కేటగరీ-ఏ, టీపీఆర్ 5-10 మధ్య ఉంటే కేటగరీ-బి, టీపీఆర్ 10-15 మధ్య ఉంటే కేటగరీ-సి, టీపీఆర్ 15 పైన ఉంటే కేటగరీ-డిగా విభజించారు. ఏ, బీ, సీ కేటగరీల్లో అన్ని షాపుల్ని రాత్రి 8 గంటల వరకూ తెరిచి ఉంచవచ్చు. కేటగరీ డిలో మాత్రం సంపూర్ణ లాక్‌డౌన్ అమలవుతోంది. 17,18 తేదీల్లో మాత్రం రాష్ట్రమంతా సంపూర్ణ లాక్‌డౌన్(Kerala lockdown) ఉండనుంది.
Also read: PM Meet: కరోనా థర్డ్‌వేవ్ ముప్పు, ఆరు రాష్ట్రాల సీఎంలతో ఈ నెల 16న ప్రధాని మోదీ భేటీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook